WHO on Omricon: కరోనా కొత్త వేరియంట్‌పై డబ్లూహెచ్‌వో కీలక సూచనలు, అప్రమత్తతే కాపాడుతుందంటున్న నిపుణులు, ఎప్పటికప్పుడు ట్రాకింగ్ లేకపోతే వినాశనం తప్పదన్న ఆరోగ్యసంస్థ
Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

Geneva November 27: కరోనా(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omricon) పట్ల ప్రపంచదేశాలను అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO). గతంలో పలు దేశాలను వణికించిన డెల్టా వేరియంట్ కంటే అనేక రెట్లు ఒమిక్రాన్ ప్రమాదకరమైనదని డబ్లూహెచ్‌వో హెచ్చరించింది. దక్షిణాఫ్రికాతో(South Africa) పాటూ ఇప్పటికే పలు దేశాల్లో ఈ వేరియంట్ విరుచుకుపడుతోంది. అనునిత్యం నిఘా పెంచాల‌ని, ప్రజారోగ్య వ్యవ‌స్థల్ని బ‌లోపేతం చేయాల‌ని డబ్లూహెచ్‌వో సూచించింది.

వ్యాక్సినేష‌న్(Vaccination) ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం చేయ‌డం ద్వారా ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా చూడవచ్చని డబ్లూహెచ్‌వో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా మార్గద‌ర్శకాల‌కు లోబ‌డే పండుగ‌లు,ఇత‌ర వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని, భౌతిక దూరం(Social distance) పాటించ‌డంతోపాటు జ‌న స‌మూహాల‌కు దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌రోనా మార్గద‌ర్శకాల‌ను(Guidelines) పాటించే విష‌యంలో అల‌స‌త్వం ప‌నికి రాద‌ని స్పష్టం చేశారు.

New COVID Variant B.1.1529: మళ్లీ ఇంకొక కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాలో బీ1.1.529 వేరియంట్ గుర్తింపు, అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ

ఆగ్నేయాసియా దేశాల్లో క‌రోనా కేసులు త‌గ్గుతున్నప్పటికీ, ప‌లు దేశాల్లో మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్(New Variant) నుంచి రక్షణ కోసం రెగ్యులర్ ట్రేసింగ్ అవసరమంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా అంత‌ర్జాతీయ ప్రయాణాల ద్వారా, కొత్త వేరియంట్ల వ్యాప్తిపై వ‌స్తున్న వార్తల స‌మాచారంతో త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ముక్కూ నోటిని క‌ప్పివేసేలా మాస్క్‌లు(Mask) ధ‌రించి, భౌతిక దూరం పాటించాల‌ని సూచిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారికి త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారికి కొత్త వేరియంట్ ముప్పు ఎక్కువగా ఉంటుందంటున్నారు.