Drugs Pixabay (rep Photo)

Newdelhi, Dec 29: అనారోగ్యంతో దవాఖానకు (Hospital) వచ్చిన ఓ 30 మహిళకు పారాసిటమాల్‌ (Paracetamol) అధిక మోతాదులో ఇచ్చారు. దీంతో ఓవర్‌ డోస్‌ అవ్వటం వల్ల ఆమె మరణించింది. బ్రిటన్‌ లోని విడ్నెస్‌ పట్టణంలో 2017లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బాధితురాలిని లారా హిగ్గిసన్‌ (30)గా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. ‘న్యుమోనియా’బారిన పడ్డ ఆమె చికిత్స కోసం 5 ఏప్రిల్‌ 2017న దవాఖానలో చేరారు. వ్యాధిని తగ్గించడం కోసం ప్రతిరోజూ పారాసిటమాల్‌ డోస్‌ ను పెంచుతూ ఆమెకు చికిత్స చేసిన వైద్యులు ఆ వైద్యం వికటించిన సంగతిని ఆలస్యంగా గుర్తించారు.

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది (వీడియో)

ఆలస్యంగా గుర్తించి విరుగుడు ఇచ్చినా..

అప్పటికే బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో దీనికి విరుగుడుగా యాంటీ డోస్‌ ఇచ్చారు వైద్యులు. అయితే, అది ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధిత మహిళ శరీరంలోని కీలక అవయాలు దెబ్బతిని మరణానికి దారి తీసిందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై వైద్య అధికారులు దర్యాప్తు చేపట్టారు.

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్