Food Delivery: ఫుడ్ డెలివరీ చేసేందుకు 30వేల కిలోమీటర్లు ప్రయాణించింది! సింగపూర్ నుంచి అంటార్కిటికా వరకు వెళ్లి ఫుడ్ డెలివరి చేసిన మహిళ, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన స్టోరీ! వీడియో ఇదుగోండి!
Longest food delivery Credit @ Screen Garb from Instagram video

Hamburg, NOV 18: ఫుడ్ డెలివరీ (Food Delivery) అంటే ఎన్ని కిలోమీటర్ల లోపు చేస్తారు? పది.. పాతిక.. యాభై.. వంద. ఈ మధ్య కొత్తగా ఒక సిటీ నుంచి మరో సిటీకి కూడా విమానాల్లో ఫుడ్ డెలివరీ చేసే సర్వీస్ మన దేశంలో కూడా ప్రారంభమైంది. అయితే, ఒక యువతి మాత్రం ఏకంగా ఫుడ్ డెలివరీ (food delivery) చేసేందుకు 30,000 కిలోమీటర్లు ప్రయాణించింది. అది కూడా నాలుగు ఖండాలుదాటి ఫుడ్ డెలివరీ చేసింది. సింగపూర్ నుంచి నిర్మానుష్య ప్రాంతమైన అంటార్కిటికా ఖండానికి ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చింది. ఈ ఫుడ్ డెలివరీ జర్నీకి సంబంధించిన వీడియోను ఆ యువతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రకారం గత నెలలో ఆ యువతి సింగపూర్ నుంచి అంటార్కిటికాకు ‘ఫుడ్‌ పాండా’ (Food Panda) డెలివరీ సంస్థ తరఫున ఫుడ్ తీసుకెళ్లింది.

 

 

View this post on Instagram

 

A post shared by Maanasa Gopal (@nomadonbudget)

ముందుగా సింగపూర్ (Singapore) నుంచి విమానం ద్వారా జర్మనీలోని హ్యాంబర్గ్ (Humburg), అర్జెంటినాలోని బ్యూనోస్ ఎయిరెస్ మీదుగా అంటార్కిటికా చేరుకుంది. అలాగని ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఒక ఖండం నుంచి మరో ఖండానికి వెళ్లేటప్పికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. పూర్తి చలి వాతావరణంలో, మంచు కురుస్తుండగా ప్రయాణించింది. కొన్నిచోట్ల మట్టి, బురద రోడ్లు దాటింది. చాలా కష్టపడి మొత్తానికి ఫుడ్ డెలివరీ చేసింది.

Saudi Arabia: భారత పౌరుల విషయంలో సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించనవసరం లేదని వెల్లడి 

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. చాలా మంది ఆ యువతిని అభినందిస్తున్నారు. ఆమె సాహసం, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.