Force Motors Gurkha (photo-carwale.com)

ఫోర్స్ మోటార్స్ 2024 గూర్ఖా 3-డోర్ మరియు 5-డోర్ మోడళ్ల ధరలను ప్రకటించింది. 2024 ఫోర్స్ గూర్ఖా 3-డోర్ ధర ₹ 16.75 లక్షలు, అయితే గూర్ఖా 5-డోర్ మీకు ₹ 18 లక్షల వరకు సెట్ చేస్తుంది . అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, TCS మినహాయించబడ్డాయి. రెండు ఆఫ్-రోడర్‌ల బుకింగ్‌లు గత నెల చివర్లో ₹ 25,000 టోకెన్‌తో ప్రారంభమయ్యాయి , అయితే డెలివరీలు మే మధ్యలో ప్రారంభమవుతాయి.

3-డోర్ వర్షన్ గుర్ఖా కంటే 5-డోర్ గుర్ఖా కారు 425ఎంఎం పొడవైన వీల్ బేస్ కలిగి ఉంటుంది. మూడేండ్లు లేదా 1.5 లక్షల కి.మీ వారంటీ అందిస్తుంది. ఇందులో నాలుగు ఫ్రీ సర్వీసులు, ఒక ఏడాది పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందిస్తుంది. మారుతి జిమ్నీ, 5-డోర్ మహీంద్రా థార్ కార్లతో పోటీ పడుతుందీ గుర్ఖా.3-డోర్ మోడల్ మాదిరే కనిపిస్తున్నా గుర్ఖా 5-డోర్ వర్షన్ ఉన్నా రెండు అదనపు తలుపులు, లాంగర్ వీల్ బేస్ ఉంటాయి. కారు ఫ్రంట్లో ఫాలోమీ హోం ఫంక్షన్, కార్నరింగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తోపాటు సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉంటాయి. రెండు హెడ్ లైట్ల మధ్య టూ స్లాట్ గ్రిల్లె జత చేశారు. స్టయిలిష్ బ్లాక్ కలర్ బంపర్, స్మాల్ ఎయిర్ డామ్, రౌండ్ ఫాంగ్ లాంప్స్ ఉంటాయి. భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ నుంచి కొత్త మోడల్, BMW M4 Competition Coupeని విడుదల చేసిన కంపెనీ, ధర కోటి యాభై లక్షలు పై మాటే..

ఫోర్స్ మోటార్స్ కొత్త 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆఫ్-రోడర్‌కు కొత్త 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను జోడించింది. ఫోర్స్ గూర్ఖా శ్రేణికి సంబంధించిన పెద్ద అప్‌డేట్ 2.6-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంటర్-కూల్డ్ డీజిల్ ఇంజన్. కొత్త మోటార్ ఇప్పుడు 138 bhp మరియు 320 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టార్క్ 1,400 rpm మరియు 2,600 rpm మధ్య విస్తృత బ్యాండ్ వద్ద వస్తుంది, ఇది హైవేపై అధిక వేగాన్ని అనుమతిస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు వెళుతుంది. ఆఫ్-రోడర్ ముందు మరియు వెనుక లాకింగ్ డిఫరెన్షియల్‌ను పొందుతుంది.2024 ఫోర్స్ గూర్ఖా ప్రధానంగా మహీంద్రా థార్ 3-డోర్ మరియు మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్‌లతో పోటీపడుతుంది.

ఫోర్స్ 5-డోర్ గుర్ఖా కారు లోపల న్యూ 9.0అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉంటుంది. అప్‌డేటెడ్ అప్‌హోల్‌స్టరీ, ఎక్స్ ట్రా సీటింగ్ రోస్ ఉంటాయి. 5-డోర్ గుర్ఖాలో సెకండ్ రో, థర్డ్ రోలో కెప్టెన్ సీట్స్ ఉంటాయి. డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, పవర్డ్ ఓఆర్వీఎం, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, మాన్యువల్ ఏసీ విత్ రూఫ్ మౌంటెడ్ రేర్ వెంట్స్, ఆల్ పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, స్పేర్ టైర్ తోపాటు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ విత్ రేర్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.

3-డోర్ గుర్ఖాలో మాదిరిగానే ఫోర్స్ 5-డోర్ గుర్ఖా కారు 2.6 లీటర్ల 4 సిలిండర్ డిజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ సామర్థ్యం 50 శాతం పెంచేశారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 140 పీఎస్ విద్యుత్, 320 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. మెర్సిడెస్ నుంచి ఈ ఇంజిన్ తీసుకున్నారు. న్యూ గుర్ఖాలో మైలేజీ నియంత్రణ కోసం ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ తెచ్చారు. 5-డోర్ గుర్ఖా 4-వీల్ డ్రైవ్ ట్రైన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ థార్ లో మాదిరిగా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కూడా ఉంటది. మహీంద్రా థార్ కంటే ఇంజెర్ గుర్ఖా మరింత శక్తిమంతంగా ఉంటుంది. ఇందులో వినియోగించే 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 132 హెచ్పీ విద్యుత్, 300 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.