Bajaj Finance

Hyderabad, జనవరి 3 : దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్‪సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్‪డ్ డిపాజిట్ (ఎఫ్‪డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్‪సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.‬‬‬‬‬‬‬‬

2024 జనవరి 2 నుంచి, బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్, వెబ్‪సైట్ ద్వారా 42 నెల్ల కాలపరిమితికి బుక్ చేసుకున్న ఎఫ్‪డిలకు సీనియర్ సిజిటన్లకు బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 8.85% వరకూ ఇవ్వనుంది. 60 ఏళ్ళలోపు వయసున్న డిపాజిటర్లు ఏడాదికి 8.60 వరకూ వడ్డీ పొందవచ్చు. కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరయిన డిపాజిట్లని 42 నెల్ల కాలపరిమితికి రెన్యువల్ చేసినప్పుడు కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి, గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬

బజాజ్ ఫైనాన్స్ కి, 2023 సెప్టెంబర్ 30 నాటి వరకూ, 76.56 మిలియన్ ఖాతాదారులు, 44.68 మిలియన్ నెట్ యూజర్లు వున్నారు. డాటా.ఐఒ నివేదిక ప్రకారం, ప్లేస్టోర్ లోని ఫైనాన్షియల్ డొమైన్లో, భారతదేశంలో బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్, అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న 4వ యాప్ గా నిలిచింది.‬2023 సెప్టెంబర్ 30 నాటికి, రూ. 54,821 కోట్ల పైగా మొత్తం డిపాజిట్ బుక్, 1.4 మిలియన్ డిపాజిట్లతో, ఈ కంపెనీ దేశంలోనే అత్యధిక డిపాజిట్లు స్వీకరించిన ఎన్‪బిఎఫ్‪సి గా అవతరించింది.

‬‬‬‬