New Bajaj Pulsar 125 Split Seat (Photo-Twitter)

New Delhi, June 18: బజాజ్ ఆటో ఇండియా తాజాగా పల్సర్‌ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ బైక్ ను (New Bajaj Pulsar 125 Split Seat) మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ సింగిల్ సిట్‌ డ్రమ్‌ వేరియంట్‌ కలిగిన అత్యున్నత టెక్నాలజీతో రూపొందించామని సంస్థ తెలిపింది. ఈ బైక్‌లో రెగ్యులర్‌ మోడల్‌ సింగిల్ యూనిట్‌కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పి‍ట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లను కంపెనీ జోడించింది. పల్సర్‌ 125 బైక్‌ (Bajaj Pulsar 125 Split Seat) కలర్‌ విషయానికి వస్తే బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో ఆకస్మిక మృతి, రుద్ర తేజ్ సింగ్ మరణం తీరని లోటు అని సంతాపం తెలిపిన బీఎండబ్ల్యూ సంస్థ

పల్సర్‌ 125 వేరియంట్‌ బైక్‌ ధరను కంపెనీ రూ.79,091గా సంస్థ నిర్ణయించింది. గత సంవత్సరం విడుదల చేసిన పల్సర్‌ 125 బైక్‌ కేవలం ఆరు నెలల్లోనే లక్ష బైకులను కస్టమర్లు కొనుగోలు చేశారని అన్నారు. స్పోర్ట్స్‌ బైక్‌ను ఇష్టపడే వారికి సరికొత్త స్టైల్‌, థ్రిల్‌తో ఈ బైక్‌ అలరిస్తుందని బజాజ్‌‌ ఆటో ప్రెసిడెంట్‌ సారంగ్‌ కనడే తెలిపారు.

గత వారం బజాజ్ ఆటో ఎంట్రీ లెవల్ మోటారుసైకిల్‌ను లాంచ్‌ చేసిన విషయం విదితమే. సీటీ 110 లోని సరికొత్త వెర్షన్‌ను రూ .37,997, రూ .44,480 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ధరల పరిధిలో విడుదల చేసింది. కొత్త సిటి 110 హై గ్రౌండ్ క్లియరెన్స్, స్ట్రాంగ​ అండ్‌ బిగ్గర్‌ క్రాష్ గార్డ్స్‌తో కఠినమైన రహదారుల్లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుందని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. మూడు రంగుల్లో లాంచ్‌ అయిన ఈ బైక్‌ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. 115 సిసి ఇంజిన్‌తో, 8.6 పిఎస్ శక్తిని అందిస్తుంది.

కిక్ స్టార్ట్ వెర్షన్ ధర రూ. 37,997 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్ రూ .44,480 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)