Hyundai Venue Executive Turbo: ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్ మోటార్ తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయిన హ్యుందాయ్ వెన్యూ SUVకి 'ఎగ్జిక్యూటివ్' వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త 'హ్యుందాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్' అనేది బేస్ మోడల్ టర్బోలో లభించనుంది. ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్-షోరూమ్ వద్ద ఈ కొత్త వేరియంట్ ధర రూ. 9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తి గల కస్టమర్‌లు ఈ SUVని ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా వారి సమీప డీలర్‌షిప్‌ని సందర్శించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డెలివరీలను త్వరలోనే కంపెనీ ప్రారంభించనుంది.
Hyundai Venue Executive వేరియంట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఫీచర్ లిస్ట్‌లో భాగంగా ఈ హ్యుందాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ రికగ్నిషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టోరేజ్‌తో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, 2-స్టెప్ రిక్లైనింగ్ సీట్లు, 60:40 స్ల్పిట్ వెనక సీటు, ప్రయాణికులందరికీ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెనకవైపు ఏసీ వెంట్స్, వెనక అద్దానికి వైపర్, వాషర్ వంటివి ఉన్నాయి.
భద్రత ఫీచర్ల పరంగా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌లతో 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్-స్టెబిలిటీ-కంట్రోల్ (ESC), వెహికల్-స్టెబిలిటీ-మేనేజ్‌మెంట్, హిల్-అసిస్ట్-కంట్రోల్ (HAC), పగలు -రాత్రి తెలిసేలా వెనుకవైపు ఒక అద్దం (IRVM), ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ మరియు టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మొదలైనవి ఉన్నాయి.
Hyundai Venue Executive ఇంజన్ సామర్థ్యం
కొత్త ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ Idle Stop & Go (ISG) ఫీచర్‌తో 120 PS పవర్ మరియు 172 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు వెలుపలి డిజైన్ చూస్తే, 16-అంగుళాల చక్రాలు, డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్‌గేట్‌పై 'ఎగ్జిక్యూటివ్' చిహ్నం ఉన్నాయి.
కొత్త వేరియంట్‌ను ప్రకటించడంతో పాటు, హ్యుందాయ్ కంపెనీ తమ VENUE S (O) టర్బో ట్రిమ్‌లో కొత్త ఫీచర్లను కూడా ప్రకటించింది. ఇది ఇప్పుడు అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, మ్యాప్ ల్యాంప్ ఫీచర్లతో వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ S (O) టర్బో ట్రిమ్ ధర ఎక్స్- షోరూమ్ వద్ద రూ. 10.75 లక్షలు కాగా, 7DCT ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 11.85 లక్షలుగా ఉంది.