Kabira Mobility EVs: గోవాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కబీరా మొబిలిటీ రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. KM3000 మరియు KM4000 పేర్లతో లాంచ్ చేసిన ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌లో అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ అందిస్తున్నారు. చేయబడింది, ఈ రెండు మోడల్‌లను ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేశారు. వీటిలో KM3000 ఇ-మోటార్ సైకిల్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.74 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, KM4000 మోడల్ ధరలు రూ. 1.76 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్ల ఆధారంగా ఈ రెండు మోటార్‌సైకిళ్లు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి.
ఇందులో KM3000 మోడల్ బైక్ పూర్తిగా ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ కాగా, KM4000 స్ట్రీట్ నేక్డ్ బైక్ మోడల్. అయితే, ఇవి రెండూ ఒకే డైమండ్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడి ఉంటాయి.
KM3000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్పెసిఫికేషన్లు
KM3000 మోటార్‌సైకిల్ స్టాండర్డ్ మరియు KM3000-V అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో స్టాండర్డ్ మోడల్ అయిన KM3000లో 4.1-kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 178 కిలోమీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుంది.
మరోవైపు KM3000-Vలో 5.15-kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది, దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 201 కిలోమీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుంది. ఈ వేరియంట్‌లలో 3 రైడింగ్ మోడ్‌లు ( ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్) అందుబాటులో ఉన్నాయి. అలాగే పార్కింగ్, రివర్స్ మోడ్‌లు ఇచ్చారు. ఈ రెండు వేరియంట్‌లు 12 kW (16.09 bhp) గరిష్ట శక్తిని, 192 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తాయి.
ఇవి కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకుంటాయి. గంటకు 120 కిమీ గరిష్ట వేగంతో పరుగెత్తగలవు.
KM4000 స్పెసిఫికేషన్లు
KM4000 మోడల్ మోటార్‌సైకిల్ కూడా KM3000 లాగే స్టాండర్డ్ మరియు V వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ బైక్ కూడా అదే తరహా బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంటుంది. అయితే, ఈ KM4000 మోటార్‌సైకిల్ అనేది డిజైన్ పరంగా నేక్డ్ బైక్ స్టైల్‌ను పొందుతుంది. ఈ బైక్ 4.5 సెకన్లలో 0 నుండి 60 kmph వేగాన్ని అందుకోగలదు, గరిష్ట వేగం గంటకు 120 కిమీగా ఉంటుంది.
రెండు మోటార్‌సైకిళ్లలో షోవా తయారు చేసిన టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల వీల్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో కూడిన మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఈ మోటార్ సైకిళ్ల బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవడానికి సుమారుగా 3 మరియు 3.5 గంటలు సమయం తీసుకుంటాయి.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ మోటార్‌సైకిళ్లు బ్లూటూత్, యాప్ కనెక్టివిటీతో కూడిన ఐదు-అంగుళాల TFT క్లస్టర్, స్విచ్ చేయగల లైట్ , డార్క్ థీమ్‌లు, KM3000ల కోసం ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, KM4000ల కోసం LEDలు, రీజెనరేటివ్ సిస్టమ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ CBS మరియు క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంచుకున్న ప్రదేశాలలో టెస్ట్ రైడ్‌లు చేయవచ్చు. కబీరా మొబిలిటీ డీలర్స్ ద్వారా మార్చి 2024 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.