Kia Seltos (Photo Credits: Kia Motors India)

Mumbai, August 22. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ గురువారం కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కియా సెల్టోస్ ఎస్‌యూవీ ధరలు ఎంట్రీ లెవల్ వేరియంట్‌కు రూ .9.69 లక్షల నుంచి మొదలై టాప్ ఎండ్ మోడల్‌కు రూ .15.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉన్నాయి.

కియా సెల్టోస్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో తయారు చేయబడిన (Made in Andhra Car). రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని పెనుగొండ సమీపంలో కియా మోటార్స్ తయారీ కేంద్రంగా ఈ కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ తయారైన కార్లు విదేశాలకూ ఎగుమతి చేయబడతాయి.

ఈ కారు నిర్మాణం మరియు ఇతర ఫీచర్ల ఆధారంగా 'GT లైన్' మరియు 'టెక్ లైన్' అనబడే రెండు ట్రిమ్ లెవెల్స్ వేరియంట్లలో కియా సెల్టోస్ ఎస్‌యూవీ లభ్యమవుతుంది. ఇందులో టెక్ లైన్ ట్రిమ్‌లో ఐదు ఉప-వేరియంట్లు కలిగి ఉన్నాయి, అవి - హెచ్‌టిఇ, హెచ్‌టికె, హెచ్‌టికె ప్లస్, హెచ్‌టిఎక్స్ మరియు హెచ్‌టిఎక్స్ ప్లస్.

మరోవైపు, GT లైన్ ట్రిమ్ మూడు ఉప వేరియంట్లను కలిగి ఉంది. - జిటి కె, జిటి ఎక్స్ మరియు జిటి ఎక్స్ ప్లస్.

GT లైన్ మరియు టెక్ లైన్ ట్రిమ్ లలో వివిధ వేరియంట్లను బట్టి ధరలు ఉండనున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మరియు మ్యాన్యువల్ ఇలా రెండు వెర్షన్ లలో ఈ కార్ లభ్యం అవుతుంది. 360 డిగ్రీస్ కెమెరా, సన్ రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్స్ లాంటి ఆప్షన్లు కూడా అందిస్తున్నారు.

 

Kia Seltos SUV విశిష్టతలు.

ఇంజిన్ సామర్థ్యం - 1400 CC సామర్థ్యంతో టర్బో పెట్రోల్ వెర్షన్ మరియు 1500 CC సామర్థ్యంతో పెట్రోల్, డీజిల్ వెర్షన్

పవర్ - 140Ps

టార్క్ - 252Nm

మైలేజ్ - లీటరుకు 16.5 కి.మీ

ఫ్యుయెల్ ట్యాంక్ - పెట్రోల్ లేదా డీజిల్

మాన్యువల్ గేర్లు - 6 లేదా ఆటోమెటిక్ ట్రాన్సిమిషన్ లో 7 గేర్లు.

0 నుంచి 100 కి. మీ వేగం కేవలం 9.7 సెకన్లలోనే అందుకోగలదు.

ఈ కారును కొనుగోలు చేయలనుకునే వారు ముందుగా కియా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా కియా డీలర్‌షిప్‌లలో రూ .25 వేల టోకెన్ ఎమౌంట్ తో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 165 పట్టణాల్లో 206 విక్రయ కేంద్రాలను ఇప్పటికే కియా మోటార్స్ ఏర్పాటు చేసింది.