lectrix lxs 2.0 e-scooter | Pic: lectrix official

Lectrix LXS 2.0 e-Scooter: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ తమ బ్రాండ్ నుంచి 'ఎల్‌ఎక్స్‌ఎస్ 2.0' పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 79,999/- గా పేర్కొంది. తమ బ్రాండ్ నుంచి ఈ కేటగిరీలో ఇదే అత్యల్ప ధర అని కంపెనీ పేర్కొంది.

లెక్ట్రిక్స్ ఎల్‌ఎక్స్‌ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 98 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని మోటార్ 2200W గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.

అదనపు ఫీచర్లను పరిశీలిస్తే.. Lectrix LXS 2.0 ఈ- స్కూటర్ 25 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది "ఫాలో మి" హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది, ఇగ్నిషన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 10-15 సెకన్ల పాటు ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో 90/110-10 ముందు భాగంలో ట్యూబ్‌లెస్ టైర్‌, వెనక భాగంలో 110/90-10 ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంటుంది.

Lectrix LXS 2.0 స్పెసిఫికేషన్లు

  • బ్యాటరీ సామర్థ్యం- 2.3 kWh
  • ప్రయాణ పరిధి- 98 కిమీ
  • గరిష్ట వేగం- 60KMpH
  • బూట్ స్పేస్ - 25 లీటర్లు
  • ధర: రూ, 79,999/-

SAR ఎలక్ట్రిక్ మొబిలిటీ MD , CEO అయిన K విజయ కుమార్ మాట్లాడుతూ.. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన విలువైన ఉత్పత్తి తమ బ్రాండ్ స్కూటర్లు అని పేర్కొన్నారు. Lectrix LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు మొదలయ్యాయి, ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి మార్చి 2024 నాటికి డెలివరీలు చేయనున్నట్లు తెలిపారు.