ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ మార్కెట్లో మరో ఈవీ కారును లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న జడ్ ఎస్ ఈవీ (ZD EV), కొమెట్ ఈవీ (Comet EV) సక్సెస్‌తో మరో ఈవీ కారు క్లౌడ్ ఈవీ (CloudEV) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. భారత్ మార్కెట్ కోసం కంపాక్ట్ యుటిలిటీ వెహికల్ (సీయూవీ).. విండ్సార్ ఈవీ (Windsor EV) కారును త్వరలో భారత్ లో ఆవిష్కరించనున్నది. జడ్ ఎస్ ఈవీ, కొమెట్ ఈవీ తర్వాత దేశీయ మార్కెట్లోకి వస్తున్న మూడో ఈవీ కారు. హుంద్యాయ్ నుంచి మార్కెట్లోకి మరో సీఎన్జీ వాహనం, మద్యతరగగతి ప్రజలకు అందుబాటు ధరలోకి తెచ్చిన కంపెనీ
విండ్సార్ ఈవీ (Windsor EV) కారులో డైనమిక్ అల్లాయ్ వీల్స్, స్లాక్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్స్), ఫుల్ విడ్త్ లైట్ బార్, ఇల్యూమినేటెడ్ ఎంజీ లోగోతోపాటు సన్ రూఫ్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, టాల్ స్టాన్స్, కూపే తరహా రూఫ్, లార్జ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.దీని ధర రూ.20 లక్షల (ఎక్స్ షోరూమ్) లోపు ఉంటుందని సమాచారం. ఈ కారు.. టాటా కర్వ్.ఈవీ (Tata Curvv.ev)తోపాటు టాటా నెక్సాన్.ఈవీ (Tata Nexon.ev), మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ (Mahindra XUV400 EV) కార్లకు గట్టి పోటీ నివ్వనుందని సమాచారం. ఎంజీ మోటార్ విండ్సార్ ఈవీ (Windsor EV) కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తోంది. 37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న ఇంజిన్ 360 కి.మీ, 50.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న ఇంజిన్ 460 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.