Ola Hyperchargers (Photo-Twitter/ Bhavish Aggarwal)

ఓలా మరో అడుగు ముందుకు వేసింది.పెట్రోల్‌ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు ఛార్జింగ్‌ (Ola Hyperchargers) సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకుల్లో ఓలా సంస్థ హైపర్‌ ఎలక్ట్రిక్‌ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది.

ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించారు. భారత్‌ పెట్రోలు బంకుల్లో (Bharat Petroleum Corporation Limited (BPCL) pumps) హపర్‌ ఛార్జింగ్‌ పాయింట్లు 6 నుంచి 8 వారాల్లోగా అందుబాటులోకి వస్తాయంటూ భవీశ్‌ తెలిపారు. పెట్రోలు బంకులతో పాటు ఇళ్ల సముదాయల దగ్గర కూడా హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్లు తెస్తామంటూ శుభవార్త తెలిపారు. పబ్లిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా భవీశ్‌ అగర్వాల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

Here's Bhavish Aggarwal Tweet

భారత్‌ పెట్రోలు బంకులు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్సు‍ల దగ్గర ఓలా సంస్థ నెలకొల్పే హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్‌ 30 వరకు ఈ ఆఫర్‌ని అందిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లకు సంబంధించి ఒక యూనిట్‌ కరెంట్‌కి రూ. 12 నుంచి రూ.15 వరకు విద్యుత్‌ సంస్థలు ఛార్జ్‌ చేస్తున్నాయి.