PLI Scheme for Auto Sector: ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం బిగ్ బూస్ట్, రూ.26,058 కోట్లతో పీఎల్‌ఐ ఇవ్వాలని నిర్ణయం, ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలకు అంచనా
Electric Vehicle

New Delhi, Sep 15: కరోనావైరస్ కు తోడు చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు (PLI Scheme for Auto Sector) చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తిని పెంచేందుకు గానూ ఈ రంగానికి రూ.26,058 కోట్లతో ( PM Narendra Modi Govt Approves Rs 26,000 Crore) ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) ఇవ్వాలని నిర్ణయించింది.

బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం ద్వారా ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలను సృష్టించొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్‌ పరిశ్రమకు ఈ ప్రోత్సాహక పథకం ప్రకటించింది. ఇందులో రూ.25,938కోట్లు ఆటో రంగానికి కాగా.. రూ.120కోట్లు డ్రోన్‌ పరిశ్రమకు కేటాయించినట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ వెల్లడించారు.

ఎమ్మెల్యేగారు.. మీరు వెంటనే నాకు లవర్‌ని వెతికిపెట్టండి, మీ ఏరియాలో అమ్మాయిల్ని ప్రేమించేలా ప్రోత్సాహించండి, మహారాష్ట్ర ఎమ్మెల్యే సుభాశ్‌ ధొతేకి లేఖ రాసిన గుర్తు తెలియని యువకుడు

వివిధ రంగాలకు ఉత్పత్తి అధారిత ప్రోత్సహకాలు అందించేందుకు కేంద్ర కేబినేట్‌ ప్రధానీ మోదీ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహన తయారీ, వాహన విడిభాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందివ్వాలంటూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రొడక‌్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటీవ్‌ విధానం ద్వారా భారత్‌లోకి ఆధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ వస్తుందని కేబినేట్‌ అభిప్రాయపడింది. పీఎల్‌ఐ విధానం వల్ల కొత్తగా రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది. అంతేకాదు అదనపు ఉత్పత్తి విలువ రూ. 2.3 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.

కేబినేట్‌లో తీసుకున్న ఇతర నిర్ణయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు

- డ్రోన్ల తయారీలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ. 5,000 కోట్లు పెట్టబడులు రావడంతో పాటు రూ. 1,500 కోట్ల మేర అదనపు ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఈ సెక్టార్‌కి ప్రోత్సహకాలు అందించేందుకు రూ. 120 కోట్ల కేటాయింపులు.

- పీఎల్‌ఐ వల్ల భారత్‌లో తయారీ సామర్థ్యం పెరుగుతుంది. చైనాకు పోటీగా మాన్యుఫ్యాక​​​​​​‍్చరింగ్‌ సెక్టార్‌లో బలపడే అవకాశం

- పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల తయారీలో భారత్‌ను ముందువరుసలో నిలబెడుతుంది

- ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పీఎల్‌ఐ బిగ్ బూస్ట్‌లా మారుతుంది

- మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌లో కొత్తగా 7.6 లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుంది

- అంతర్జాతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో భారత్‌ వాటా కేవలం 2 శాతంగా ఉందని, తాజా నిర్ణయంతో అది పెరుగుతుంది.

- టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం

- ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి నాలుగేళ్ల పాటు టెల్కోలకు మారటోరియం విధించింది.

అయితే ఈ పథకం కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహన తయారీ సంస్థలకు మాత్రమే. పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహన తయారీ సంస్థలకు ఇది వర్తించదని తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల వ్యవధితో ఈ పథకాన్ని ప్రకటించింది. 10 వాహన తయారీ సంస్థలు, 50 ఆటో విడిభాగాల ఉత్పత్తి సంస్థలు దీని నుంచి లబ్ధి పొందుతాయని కేంద్రం చెబుతోంది. మొత్తం 22 విడిభాగాల తయారీకి ఈ ప్రోత్సాహకాలు అందిస్తోంది.

మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదినమే ఇంజనీర్ల దినోత్సవము, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించిన భరతజాతి ముద్దు బిడ్డ జీవిత చరిత్ర మీకోసం

వాతావరణ మార్పులు, పారిస్‌ ఒప్పందం నేపథ్యంలో భారత్‌ స్వచ్ఛ ఇంధనం వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చమురు అవసరాలు పెరిగిపోతుండంతో దిగుమతుల కోసం విదేశాలపై భారీగా ఆధారపడాల్సి వస్తోంది. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది నిత్యావసర ధరలపైనా ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విద్యుత్తు, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది.

అయితే, ఇప్పటి వరకు దేశీయంగా ఇంకా అనేక వాహన సంస్థలు విద్యుత్‌ వాహనాల తయారీ వైపు మళ్లాల్సి ఉంది. టాటా మోటార్స్ మాత్రమే గణనీయ స్థాయిలో విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీవీఎస్‌ మోటార్‌, హీరోమోటో కార్ప్‌ ఇప్పుడిప్పుడే ఈవీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి.