భారతదేశంలో అప్పుడే పండుగ వాతావరణం మొదలయ్యింది. ఈ పండుగ వాతావరణంలో చాలా మంది కొత్త కార్లు లేదా బైకులను కొనుక్కొవడానికి ఎక్కవ ఆసక్తి చూపుతారు. అయితే ఈ తరుణంలో దేశీయ కొనుగోలు నుంచి లేటేస్ట్ మోడల్ లో తయారు చేయబడ్డ ఐదు స్పోర్టీ స్కూటర్ లు వచ్చేసాయి. వీటి యెక్క వినియోగం ఎలా ఉంటుందో తెలుసుకుందామా..
టీవీఎస్‌ఎన్ టార్క్ 125 (TVS Ntorq 125):
టీవిఎస్ మోటర్ కంపెనీకి చెందిన ఎన్‌టార్క్ 125 స్కూటర్ బేసిక్ మోడల్ ధర రూ.84636. అదే టాప్ ఎండ్ మోడల్ ధర అయితే రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్).అలాగే మంచి డిజైన్ లేటెస్టె ఫీచర్స్ తో కలిగి ఉంది. ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజన్ కలిగి 7000 ఆర్‌పీఎమ్ వద్ద 9.25 బీహెచ్ పీ పవర్, 5500 ఆర్‌పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ ను అందజేస్తుంది. సీవీటీ యూనిట్ తో లభించే ఈ స్కూటర్ మంచి గా పనిచేస్తుంది.
సుజుకి అవెనిస్ 125(Suzuki Avenis125):
సుజుకి మోటర్ సైకిల్ కంపెనీ అవెనిస్ 125 రూ. 89900 ప్రారంభం ధర నుంచి లభించే ఈ స్కూటర్ 124.3 సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. 6750 ఆర్ పీఎమ్ వద్ద 8.58 బీహెచ్ పీ పవర్,5500 ఆర్‌పీఎమ్ వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
హోండా గ్రాజియా 125 (Honda Grazia 125):
హోండా గ్రాజియా 125 మంచి డిజైన్ తో కలిగి రూ. 82520 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఉత్తమమైన స్కూటర్లలో ఈ మోడల్ ఒకటి. ఇందులో 6000 ఆర్ పీ ఎమ్ వద్ద 8.14 బీహెచ్‌పీ పవర్, 5000 ఆర్‌పీఎమ్ వద్ద 10.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సీవీటీ యూనిట్ తో లభించే ఈ స్కూటర్ పనితీరు పరంగా చూస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది.
యమహా రే జెడ్ ఆర్ 125 (Yamaha Ray ZR 125):
ఈ కంపెనీకి చెందిన రే జెడ్‌ఆర్ 125 మన జాబితాలోని ఉత్తమ స్కూటర్లలో ఇది ఒకటి. రూ.84730 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ వాహనం 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి 8.04 బీహెచ్ పీ పవర్, 10.3 టార్క్ ను అందిస్తుంది.