పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ఆభరణాలు ప్రతీ ఒక్కరూ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆభరణాల దుకాణానికి వెళ్లినప్పుడు సదరు ఆభరణాల వ్యాపారి మీకు రెండు ఆప్షన్లు ఇస్తారు. 22 కేరట్లు, 24 కేరట్లు రెండింట్లో దేనికి ప్రాధాన్యం ఇస్తారో తెలుసుకోండని సూచిస్తారు. కే అంటే క్యారట్.. బంగారం స్వచ్ఛత (ప్యూరిటీ)ను క్యారట్లలో గుర్తిస్తారు. ఎక్కువ క్యారట్లలో బంగారం ఉంటే దాని స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది. 24 క్యారట్ల బంగారం అంటే అత్యంత స్వచ్ఛత గల బంగారం లభిస్తుంది. 22 క్యారట్లు, 24 క్యారట్ల బంగారం స్వచ్ఛతలో చాలా తేడాలు ఉన్నాయి.
24 క్యారట్ల బంగారం అంటే ఏంటి..?
24 క్యారట్ల బంగారం అంటే 99.9 ప్యూరిటీ ఉంటుంది. వాటిల్లో ఇతర లోహాలకు చోటు ఉండదు. 24 క్యారట్ల బంగారం కంటే ప్యూరిటీ గల గోల్డ్ ఉండనే ఉందు. భారత్‌లో 24కే బంగారం ధర రోజురోజుకూ మారుతూ ఉంటుంది. 22 కే, 18కే గోల్డ్ కంటే అత్యంత విలువైందీ 24 కే బంగారం. ఇది ఫైనాన్సియల్ అవసరాలకు సూటబుల్.. తర్వాత సాఫ్ట్‌గా మారుతుంది ఈ బంగారంతో ఆభరణాలు చేయలేరు.
22 క్యారట్ల బంగారం అంటే ఏంటి..?
22 క్యారట్ల బంగారం అంటే తులం బంగారంలో 22 క్యారట్ల స్వచ్చత ఉంటుంది. మిగతా రెండు క్యారట్ల స్థానంలో జింక్, రాగి తదితర లోహాలు మిక్స్ చేస్తారు. ఇది 24 క్యారట్ల బంగారం కంటే గట్టిగా ఉంటుంది. జ్యువెల్లరీ తయారీకి ఇది సూటబుల్. ఇందులో 91.67 శాతం ప్యూరిటీ ఉంటుంది. అందుకే దీన్ని 916 గోల్డ్ అని అంతా పిలుస్తుంటారు.
ఇన్వెస్ట్‌మెంట్ కోసమైతే 24 క్యారట్ల బంగారం కొనాలి. ప్రతి రోజూ ధరించే ఆభరణాలంటే 22 క్యారట్ల బంగారం కొనుక్కోవడం బెస్టంటున్నారు బులియన్ నిపుణులు. జ్యువెల్లరీ వ్యాపారులు.. ఆభరణాలు డిజైన్ చేసి తయారు చేయడానికి 22 క్యారట్ల బంగారం అనువుగా ఉంటుంది. మిగతా రెండు క్యారెట్ల ఇతర లోహాలతో 22 క్యారట్ల బంగారం కలిపితే ఆభరణాలు తయారు చేయడానికి సూటబుల్‌గా ఉంటుంది.