Newdelhi, Dec 3: ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం (Great Relief) లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్ (Market Value Cap) అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.
వాస్తవానికి యూపీఐ మార్కెట్‌లో కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని నిరోధించడానికి ప్రభుత్వం గరిష్టంగా 30% మార్కెట్ వాటా నియమాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. యూపీఐ సేవలను అందించే కంపెనీ 30% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండకూడదు. ఈ నియమాన్ని పాటించడానికి ఎన్‌పీసీఐ యూపీఐ యాప్‌లకు 31 డిసెంబర్ 2022 వరకు సమయం ఇచ్చింది. అయితే ఇప్పుడు కాలపరిమితిని రెండేళ్లు పొడిగించారు.
ప్రస్తుతం దేశంలో 96% UPI లావాదేవీలు కేవలం మూడు యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలు ఉన్నాయి. వీటిలో 80% యూపీఐ లావాదేవీలు ఫోన్ పే, గూగుల్ పే రెండు యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి.