New Modi Schemes PMJJBY and PMSBY benefits (Photo-ANI)

New Delhi, October 19: కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)ను అలాగే ప్రధానమంత్రి సురక్షా యోజన (పీఎంఎస్‌బీవై)Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)ల పేరుతో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటి కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించింది. అయితే ఏడాదికేడాది రెన్యువల్ చేయించుకుంటూ ఉంటే పథకానికి మీరు అర్హులవుతారు.ఈ స్కీముల ద్వారా అనుకోని పరిణామాలు జరిగితే దాదాపు రెండు లక్షల రూపాయలు వస్తాయి. పాలసీ వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

ప్రధాన్ మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పి‌ఎం‌జే‌బి‌వై) పథకానికి 18 సంవత్సరాలు మరియు 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రతి యేడాదికి రూ. 330/- ప్రీమియం ఉంటుంది. పాలసీ దారుడు ఈ పాలసీని తీసుకుంటే రెండు లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఒకసారి మీరు పాలసీ తీసుకుంటే ఆటోమేటిగ్గా కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)ను అలాగే ప్రధానమంత్రి సురక్షా యోజన (పీఎంఎస్‌బీవై)Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)ల పేరుతో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటి కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించింది. సంవత్సరానికి మీ అకౌంట్ నుంచి రూ. 330 కట్ అవుతూ ఉంటాయి.

పాలసీ గడువు  జూన్ 1 నుంచి తరువాత ఏడాది మే 31 వరకు ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వారు మరణించినప్పుడు పాలసీ మొత్తం నామినీకి వస్తుంది. అంతేతప్ప మరేఇతర ప్రయోజనాలు లభించవు. బ్యాంకుల్లో ఈ పాలసీ తీసుకోవచ్చు. దీని కోసం బ్యాంకులు ఎల్ఐసీ సహా ఇతర ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పాలసీని అందిస్తున్నాయి. ఒక వ్యక్తి ఒక అకౌంట్ ద్వారా ఒక్కసారి మాత్రమే పాలసీ తీసుకోగలడు. పాలసీదారుడు మరణిస్తే నామిని వారి డెత్ సర్టిఫికెట్‌ను తీసుకొని బ్యాంకుకు వెళ్లి బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు నామినీ అకౌంట్‌లోకి బీమా డబ్బులు వస్తాయి.

పీఎంఎస్‌బీవై(ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన) పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వారెవరైనా చేరొచ్చు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. ఈ బీమా చేయించుకున్న వారు ప్రమాదవశాస్తు మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యానికి గురైనా రూ.రెండు లక్షల పరిహార పొందొచ్చు. పాక్షిక అంగవైకల్యానికి లక్ష రూపాయలు అందజేస్తారు.

ఏపీవై (అటల్‌ పెన్షన్‌ యోజన) 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆటో వర్కర్లు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ స్కీములో చేరి నెల నెలా కొంత పింఛను పొందొచ్చు. నెలకు రూ.1000 నుంచి రూ.5వేల వరకు పింఛను పొందే అవకాశం ఈ స్కీములో ఉంది. రూ 1000 పెన్షన్‌ పొందాలంటే నెలకు రూ 42, రూ 5వేలు పొందాలంటే నెలకు రూ 210 ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీలకు సంబంధించి మరిన్ని వివరాలను మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుల్లో సంప్రదించవచ్చు.