Newdelhi, Oct 29: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ (Death threat) ఆయన కంపెనీకి చెందిన ఈ-మెయిల్ (email) అడ్రస్ కు సందేశం పంపించారు. అయితే ఇప్పుడది రూ.200 కోట్లకు పెరిగింది. వారి బెదిరింపులకు ముకేశ్ అంబానీ స్పందించకపోవడంతో తాజాగా మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. మొదట పంపిన మెయిల్ కు ఎలాంటి స్పందన లేకపోవడంతో రూ.200 కోట్లు డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని ఆగంతకులు బెదిరించారు.
'Now, amount is Rs 200 crore': Mukesh Ambani gets another death threat #AMBANI #AMBANI_DEATH_THREAT #AMOUNT #CRORE #DEATH #MUKESH #MUKESH_AMBANI #MUKESH_AMBANI_DEATH_THREAT #MUKESH_AMBANI_DEATH_THREAT_EMAIL #MUKESH_AMBANI_NEWS #RELIANCE_CHAIRMAN #REL...https://t.co/QHTFpbvsQR
— rebben (@rebben02664383) October 28, 2023
దేశంలోనే అత్యుత్తమ షూటర్స్
తమవద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్స్ ఉన్నారని అందులో పేర్కొన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రెండు బెదిరింపు మెయిల్స్ ఒకే అకౌంట్ నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.