TCS (Photo Credits: PTI)

Hyderabad, Oct 16: దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ (TCS) లో భారీ కుంభకోణం (Job Scam) వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీలో లంచాలకు ఆశపడి ఉద్యోగాలను అమ్ముకోవడం బయటపడింది. విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం రిక్రూట్‌ మెంట్ స్కాంతో సంబంధం ఉన్న 16 మంది ఉద్యోగులను, ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. ఈ చర్య గురించి కంపెనీ ఆదివారం బహిరంగంగా ప్రకటించింది.

మొత్తం 19 మంది ఉద్యోగులపై చర్యలు

ఈ చర్యకు సంబంధించి టాటా గ్రూప్ ఐటీ కంపెనీ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రిక్రూట్‌ మెంట్ స్కామ్‌ పై సమాచారం అందిన తర్వాత, దానిని క్షుణ్ణంగా విచారించినట్లు కంపెనీ తెలిపింది. విచారణలో రిక్రూట్‌మెంట్ స్కామ్‌ లో 19 మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు కంపెనీ గుర్తించింది. వారిలో 16 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించగా, ముగ్గురిని రిసోర్స్ మేనేజ్‌మెంట్ యూనిట్ నుండి తొలగించారు.