October 12: ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న మెసేజింగ్ దిగ్గజం యూజర్లకు ఒక్కసారిగా షాకిచ్చింది. కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లకి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఎంత వెతికినా కనపడలేదు. ఫేస్ బుక్ సొంతమైన వాట్సప్ గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపించకుండా మాయమైందంటూ వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారని ఎమ్‌ఎస్‌పవర్ యూజర్ వెబ్‌సైట్ తెలిపింది. అయితే ఈ సమస్యకు కారణం తెలియరాలేదు. ఇదివరకే వాట్సప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారు అన్‌ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మై యాప్స్ సెక్షన్ ద్వారా తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అయితే కొత్తగా దీన్ని డౌన్లోడ్ చేసుకునేవారికి ఇది కనపడటం లేదని ఆ వెబ్‌సైట్ తెలిపింది. కాగా పాత యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోగలిగారు కాబట్టి గూగుల్ ప్లేస్టోర్ నుంచి పూర్తిగా మాయం కాలేదని అర్థమవుతోందని విశ్లేషించింది. ఇదిలా ఉంటే గూగుల్ ప్లేస్టోర్‌లో ‘వాట్సప్ ఫర్ బిజినెస్’ యాప్ ఇప్పటికి ఉన్నట్టు గుర్తించామని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెబ్‌సైట్ వెల్లడించింది.
కాగా గత కొన్నేళ్లలో వాట్సప్ వినియోగదారులు బాగా పెరిగిపోతున్నారు. ప్రతిఒకరూ తమ మొబైల్స్‌లో వాట్సప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వీడియో కాల్స్.. వాయిస్ కాల్స్.. మెసేజెస్ ఇలా దేని కోసమైనా ప్రస్తుతం ఉపయోగించేది వాట్సప్ మాత్రమే.