Baahubali The Beginning becomes first non-English film to be screened at Royal Albert Hall in London ( Photo-Twitter)

October 20: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి పంచెకట్టులో మెరిసారు. ప్రపంచదేశాలకు తెలుగు సినిమా ఇలా ఉంటుందని చూపిన బాహుబలి ది బిగినింగ్ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసిన సంగతి విదితమే. ఈ సినిమా లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మరో సారి ప్రదర్శితమైంది. దేశ విదేశాల్లో ఈ సినిమా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రపంచం నలుమూలల నుంచి సినిమా చూడటానికి లండన్ తరలివచ్చారు. బాహుబలి టీంతో అందరూ ఫోటోలు దిగారు. ఈ ఈవెంట్లో తొలిసారిగా రాజమౌళి అచ్చ తెలుగు పంచెకట్టులో మెరిసారు. పంచెకట్టులో ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకుల ముందు బాహుబలి ది బిగినింగ్ సినిమా ప్రదర్శించారు. ప్రారంభానికి ముందు సంగీత దర్శకుడు కీరవాణి తన మ్యూజిక్ మాయని మరోసారి అక్కడి వారికి పరిచయం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్ర నటీ నటులు ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరయ్యారు. అక్కడ వీరు దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

జపాన్ అమ్మాయిలతో దర్శక ధీరుడి సందడి

ఇక్కడ సినిమాను చూడాలని జపాన్ నుంచి లండన్ వరకూ కొంతమంది అమ్మాయిలు రావడం గమనార్హం. వారంతా రాజమౌళితో ఫోటోలు దిగడానికి ఆసక్తిని చూపారు.

పంచెకట్టులో మెరిసిన రాజమౌళి

ఈ ఈవెంట్లో రాజమౌళి పంచెకట్టులో అదరహో అనిపించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రభాస్ న్యూ లుక్

కాగా  రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి లండన్ వెళుతూ రెబల్ స్టార్ ప్రభాస్ కెమెరా చేతికి చిక్కారు. ఆయన న్యూ లుక్ అదరహో అనిపించేలా ఉంది.

ఈ సంధర్భంగా రాజమౌళి మాట్లాడుతూ బాహుబలికి అంతం లేదని అది ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుందని అన్నారు. బాహుబలి టీ మొత్తం లండన్ వీధుల్లో సరదాగా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి.