Three years of Baahubali 2 (Photo-Prabhas Instagram)

Hyd, April 28: తెలుగు సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన అద్భుత చిత్రకావ్యం బాహుబలి (Baahubali) గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారు ఉండరు. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచదేశాలకు పరిచయం చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించింది. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, పవర్‌ఫుల్‌ విలన్‌గా రానా..బాహుబలి‌, భల్లాలదేవ పాత్రల్లో ఇద్దరూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడి నటించారు. ఈ సినిమాతో ప్రభాస్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా, రాణా బాలీవుడ్ సినిమాలో ఛాన్సులు దక్కించుకున్నారు.  'అకౌంట్లో సరిపోయే డబ్బుల్లేవు, అయినా నాకేం కొత్త కాదు'.. కరోనావైరస్ సంక్షోభంలో దెబ్బతిన్న వారికి రూ. 1.30 కోట్ల ఫండ్‌తో సహాయం ప్రకటించిన విజయ్ దేవరకొండ

బాహుబలి-2 ది కన్‌క్లూజన్’‌ సినిమా (Three years of Baahubali 2) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో(మంగళవారం) సరిగ్గా మూడేళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ (Prabhas) బాహుబలి చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపుతూ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో ట్వీట్ చేశారు. తన జీవితంలో ఇది అతిపెద్ద సినిమా అని, ఎప్పటికీ గుర్తిండేపోయే మధుర జ్ఞాపకమని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 

బాహుబలి-2 కేవలం సినిమా మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందిన చిత్రం. నా జీవితంలో అతిపెద్ద సినిమా. నా అభిమానులకు బాహుబలి చిత్ర యూనట్‌కు, అద్భుత చిత్రంగా తీర్చిదిద్దిన రాజమౌళికి రుణపడి ఉంటాను. బాహుబలి-2 పూర్తి అయి మూడు సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఇంతటి గొప్ప చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. మీ అందరి ప్రేమలకు కృతజ్ఞుడిని’. అంటూ షూటింగ్‌ సమయంలో రానా, రాజమౌళితో కలిసి ఉన్న ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తారక్ ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు. కేటీఆర్‌,రజినీకాంత్‌ల‌ను నామినేట్ చేసిన మెగాస్టార్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్

కాగా బాహుబలి మొదటి భాగం 2015లో విడుదలవ్వగా రెండో భాగం 2017 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రదారులుగా ఈ సినిమాలో నటించారు.