Aaradhya Bachchan Case: అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్యపై తప్పుడు కథనాలు, యూట్యూబ్‌కు హెచ్చరికలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు, గూగుల్ కు స‌మ‌న్లు జారీ
Aaradhya Bachchan With Big B (Photo Credits: Twitter)

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, అభిషేక్‌-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్‌ తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి విదితమే. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై విచారించిన హైకోర్టు యూట్యూబ్ ఛానళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. త‌క్ష‌ణ‌మే త‌మ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఆ వార్త‌ల‌ను తొల‌గించాల‌ని కోర్టు ఆదేశించింది. భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను వ్యాప్తి చేయరాదు అని యూట్యూబ్‌ను హెచ్చ‌రించింది.

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నిర్మాత యష్ చోప్రా భార్య పమేలా చోప్రా మృతి, సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు

యూట్యూబ్‌లో 11 ఏళ్ల ఆరాధ్య ఆరోగ్యం గురించి ఇటీవ‌ల ఫేక్ న్యూస్ రిపోర్ట చేశారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌లు కోర్టును ఆశ్ర‌యించారు. కేసు విచార‌ణ స‌మ‌యంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిల‌దీసింది. త‌ప్పుడు కాంటెంట్‌ను పోస్టు చేయ‌కుండా ఉండే పాల‌సీలు ఏమీ లేవా అని కోర్టు యూట్యూబ్‌ను ప్ర‌శ్నించింది. యూజ‌ర్ల‌కు ఓ ఫ్లాట్‌ఫామ్ ఇచ్చేశాం, వాళ్లు ఏది పోస్టు చేసినా త‌మ‌కు బాధ్య‌త లేద‌న్న‌ట్లు యూట్యూబ్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

పుష్ప 2 మరో సంచలన రికార్డు, విడుదలైన 10 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్, గ్లింప్స్ తోనే రికార్డుల వేట మొదలైందని ఖుషీ అవుతున్న అభిమానులు

ఐశ్వ‌ర్య వేసిన పిటిష‌న్ ఆధారంగా గూగుల్, యూట్యూబ్‌కు స‌మ‌న్లు జారీ చేశారు. ఐటీ రూల్స్ ప్ర‌కారం త‌మ పాల‌సీల‌ను మార్చుకున్నారా లేదా అని ప్ర‌శ్నించింది. ప్ర‌తి చిన్నారికి గౌర‌వంగా, మ‌ర్యాద‌గా జీవించే హ‌క్కు ఉంద‌ని, ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న యూట్యూబ్ పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

11 ఏళ్ల వయసు ఉన్న ఆరాధ్యపై కొన్ని యూట్యూబ్‌ చానళ్లు తరచూ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఆమెను టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. తన కూతురుపై వచ్చిన తప్పుడు కథనాలపై గతంలో అభిషేక్‌ మీడియా ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రెటీల పిల్లలను ట్రోల్స్‌ చేయడం సరికాదని, అలాంటి వారిని క్షమించొద్దని అన్నారు. అయినా కూడా ట్రోల్స్‌ తగ్గలేదు. దీంతో ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది.