File image of MNM chief Kamal Haasan | (Photo Credits: ANI)

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, మక్కల్‌ నీది మయ్యమ్ అధ్యక్షుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan Health Update) ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు స్వల్పంగా కరోనా లక్షణాలు (Kamal Haasan Corona) కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. కరోనాపాజిటివ్ అని తేలింది. దీంతో వెంట‌నే చెన్నైలోని ప్రైవేటు ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. క‌మ‌ల్ ఆరోగ్యం ఎలా ఉందో అభిమానులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో కూతురు శృతి హాస‌న్ (Shruti Haasan) త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది.

“నా తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం తను కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది. ఇక కమల్ కు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఫోన్‌ చేసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

విషమంగా శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్యం, రంగంలోకి దిగిన సోనూసూద్, ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి, కోవిడ్‌ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌

కమల్‌హాసన్‌ కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికిరావాలని ఆకాంక్షించిన వారిలో హీరోలు ప్రభు, ఆర్‌.శరత్‌కుమార్‌, విష్ణు విశాల్‌, శివకార్తికేయన్‌లతో పాటు దర్శకుడు ఎస్పీ ముత్తురామన్‌, నటుడు రాధారవి, దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, దర్శకుడు అట్లీ, మలయాళ నటుడు పహద్‌ ఫాజిల్‌, నిర్మాత ఐసరి గణేశ్‌, విద్యాసంస్థల అధినేత ఏసీ షణ్ముగం, శివాజీ ఫిలిమ్స్‌ అధినేత రామ్‌కుమార్‌, యువ హీరో విక్రమ్‌ ప్రభులు ఉన్నారు.

Here's shruti haasan Tweet

క‌మ‌ల్ హాసన్ ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ అనే సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా ఉన్నారు. క‌మ‌ల్‌కి క‌రోనా సోకిన నేప‌థ్యంలో వీకెండ్ ఎపిసోడ్స్‌కి గెస్ట్‌గా ఎవ‌రిని తీసుకురావాల‌నే విష‌యంలో నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.