ప్రముఖ నటి పాయల్ ఘోష్ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సగం రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదిహేడేళ్ల వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టిన ఈ భామ షేర్ప్స్ పెరిల్' అంగే ఇంగ్లీష్ చిత్రంలో నటించింది. తర్వాత చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'ప్రయాణం' మూవీలో కథానాయికగా మెరిసింది. ఆ తర్వాత 'ఊసరవెల్లి', 'మిస్టర్ రాస్కెల్' వంటి సినిమాలు చేసింది. 'పటేల్ కీ పంజాబీ షాదీ' సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది
తాజాగా పాయల్ సూసైడ్ నోట్ పోస్ట్ చేసింది. 'ఒకవేళ నాకు గుండెపోటు వచ్చినా, ఆత్మహత్య చేసుకుని మరణించినా అందుకు కారణం ఎవరంటే....' అని సగం రాసి ఉన్న పేజీని పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నటి గురించి ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగింది? బాగానే ఉన్నావా? దయచేసి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకో, ఇలాంటి ఆలోచనలు దగ్గరికి కూడా రానివ్వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్.. మీటూ ఉద్యమం సమయంలో నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే!