Adipurush (Credits: Twitter)

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించగా జానకి పాత్రలో కృతీ సనన్ నటించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.

భోళా శంకర్ సినిమా నిలిపివేత, అనుమతి లేకుండా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ సినిమాను అడ్డుకున్న పోలీసులు

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' లో నిన్న అర్ధరాత్రి నుంచి ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఇది అందుబాటులో ఉంది. ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే ఈ సినిమాను చూడొచ్చు. దక్షిణాది భాషల్లో సినిమా అమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆదిపురుష్ హిందీ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.