Akshay Kumar covid-19: అక్షయ్‌ కుమార్‌కు కరోనా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బాలీవుడ్‌ హీరో, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తానంటూ ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన (Akshay Kumar covid-19) పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ (Akshay Kumar on Instagram)ద్వారా వెల్లడించారు. ‘‘ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్‌గా ధృవీకరించారు.

Akshay Kumar covid-19: అక్షయ్‌ కుమార్‌కు కరోనా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బాలీవుడ్‌ హీరో, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తానంటూ ట్వీట్
Akshay Kumar (Photo Credits: Instagram)

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన (Akshay Kumar covid-19) పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ (Akshay Kumar on Instagram)ద్వారా వెల్లడించారు. ‘‘ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్‌గా ధృవీకరించారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం.. సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను.

గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోండి. వైద్యుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను.’’ అంటూ అక్షయ్ ట్వీట్ చేశారు. కాగా, అక్షయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ఆ మేరకు అక్షయ్ ట్వీట్‌కు రిప్లై ఇస్తున్నారు.

Here's Tweet

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఇప్పటికే.. ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్‌, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా అక్షయ్ కుమార్‌ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో బీటౌన్‌లో కంగారు మొదలైంది.

(The above story first appeared on LatestLY on Apr 04, 2021 02:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).