Image: Twitter

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతేడాది డిసెంబర్ లో వచ్చిన అఖండ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. సంక్రాంతి వరకూ థియేటర్లలో కలెక్షన్ల మోత మోగించిన అఖండ.. ఆ తర్వాత ఓటీటీలో విడుదలై.. అదే హవా కొనసాగించింది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైతీ మూవీ మేకర్స్ బాలకృష్ణ 107వ సినిమాను ప్రకటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ ను కూడా రివీల్ చేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య 107వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైనింగ్ మాఫియా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. బాలయ్య కొత్తలుక్ అదిరిపోయింది. మాస్ లుక్ లో కనిపిస్తున్న బాలయ్యను చూసి.. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా కూడా హిట్టేనంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. "బాలకృష్ణ గారితో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు మాట ఇస్తున్నా. బాలయ్య వేటాడితే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపిస్తా అంటూ.. గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు."

పుణేలో దారుణం, పడుకోవడానికి రాలేదని సెక్స్ వర్కర్‌పై బ్లేడుతో దాడి చేసిన విటుడు, మరో ఘటనలో ఢిల్లీలో 87 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

ఇది కూడా చదవండి..