Mumbai, August 6: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించిన ఒక్కరోజులోనే కేసు వేగం పెరిగింది. వెంటనే యాక్షన్ లోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక బృందం గురువారం సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సహా ఆమె తండ్రి ఇందజిత్, తల్లి సంధ్య , సోదరుడు షోవిక్, ఆమె మేనేజర్ శృతి మోదీ మరియు సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరందాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
సుశాంత్ సింగ్ ను ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆయన చుట్టూ కుట్రలు చేయడం, దొంగతనం, మోసం, నిర్బంధించడం మరియు బెదిరింపులకు పాల్పడినట్లు నటి రియా చక్రవర్తి మరియు ఆమె సంబంధీకులపై ఆరోపణలు ఉన్నాయి. తన కొడుకు బ్యాంక్ ఖాతాలోంచి సుమారు రూ. 15 కోట్లు మాయం చేశారని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే రియా మాత్రం కోర్టును ఆశ్రయించి ఈ కేసును ముంబైకి బదిలీ చేయించుకుంది.
అయితే ముంబై పోలీసుల దర్యాప్తుపై ఫిర్యాదులు పెరిగాయి. మరోవైపు నటుడికి అన్ని వైపుల నుంచి మద్ధతు పెరుగుతుండటంతో , ముంబై పోలీసులు తమకు సహకరించడం లేదని పేర్కొంటూ ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని బీహార్ పోలీసులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిజాలు బయటకు రావాల్సిందే, సుశాంత్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలపడంతో సుప్రీంకోర్టు ఆగష్టు 5న ఈ కేసును సీబీఐ దర్యాప్తుకి అప్పజెప్పింది. విచిత్రమేటిటంటే నటి రియా కూడా ఈ కేసు సీబీఐకి అప్పజెప్పాలంటూ అంతకుముంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ట్వీట్ చేసింది. అయితే చివరకు సీబీఐ రంగంలోకి దిగి మొదట రియా పైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం.
Here's the update:
CBI registers FIR against Rhea Chakraborty, Indrajit Chakraborty, Sandhya Chakraborty, Showik Chakraborty, Samuel Miranda, Shruti Modi, and others in connection with #SushantSinghRajput's death case. pic.twitter.com/KEy7iCegcv
— ANI (@ANI) August 6, 2020
తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరియు అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఛాపర్ స్కాంలపై దర్యాప్తు చేసిన స్పెషల్ ఎలీట్ టీం, ఇప్పుడు సుశాంత్ కేసును టేకప్ చేసినట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.
గత జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడు. తొలుత ఇది ఆత్మహత్యగా భావించినా, నటుడు చనిపోయిన తీరు పట్ల అనేక సందేహాలు తలెత్తడంతో ఆయన మృతిపై విచారణ జరపాలని, న్యాయం చేయాలంటూ అప్పట్నించీ, ఇప్పటివరకు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ వాణిని బలంగా వినిపిస్తూ వస్తున్నారు.