లెజండరీ డైరెక్టర్ రాజమౌళి, ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు కరోనా మెగా ఫ్యామిలీ మీదకు వెళ్లింది. నాగబాబుకు కరోనా పాజిటివ్ (Naga Babu Tested possitive for coronavirus) అని నిర్థారణ అయింది. అయితే దీనికి గురించి నాగబాబు (Naga Babu Konidela) నోరు విప్పకముందే రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు ట్విటర్ వేదికగా నాగబాబు విషయాన్ని వెల్లడించారు. తొందరగా కరోనాను జయించి ప్లాస్మాను దానం చేస్తానని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే నాగబాబు గత కొన్నిరోజులుగా ఓ ఛానల్‌లో వచ్చే కామెడీ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. బహుశా అక్కడి నుంచే వైరస్ సోకి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగబాబు సూచించారు. నాగబాబు త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు రీట్వీట్లు పెడుతున్నారు.ప్రస్తుతం నాగబాబు హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడు. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు
నాగబాబు తెలుగు టెలివిజన్‌లో ఒక షో నడుతున్న విషయం తెల్సిందే. అంతేకాదు అతను తన కుమార్తె నిహారికాతో ఓ ఇంటర్వూ కూడా చేశారు. షూట్ సమయంలోనే అతనికి వైరస్ సోకి వుంటుందని భావిస్తున్నారు. అలాగే అనేకమంది తెలుగు టీవీ తారలు, ప్రముఖుల షూట్‌లో పాల్గొనడం వల్ల కరోనా బారిన పడ్డారు.