Balakrishna on Covid: కరోనాతో కలిసి బతకాల్సిందే, హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు, సెహరి సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన నందమూరి నటసింహం
sehari filst lokk launch balayya (Photo-Twitter)

నందమూరి బాలకృష్ణ సోమవారం 'సెహరి' సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన బాలకృష్ణ కరోనా వైరస్‌ కారణంగా సినీ ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు, మనుషులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ కొన్ని సూచనలు (Balakrishna on Covid) కూడా చేశారు. కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు... అసలు వ్యాక్సిన్‌ రాదు’ అని అన్నారు. బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ (#CoronavirusVaccine) వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు.

కరోనా మన జీవితాంతం ఉంటుంది. దాంతో మనం సహ జీవనం చేయాల్సిందే. ఇవాళ నుండి కార్తీక సోమవారం. అయిన సరే తల స్నానాలు చేయవద్దు’ అని ఆయన సూచించారు. కాగా కరోనా కట్టడికి పలు దేశాల్లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ మూడవ దశ మానవ ప్రయోగాలను కూడా పూర్తి చేసుకొని ప్రపంచం ముంగిట్లోకి రానున్నది.

ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఎలా ఉండాలనే విషయాన్ని అందరూ ఆలోచించాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడు కరోనా పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ షూటింగ్ చేస్తున్న 'సెహరి' యూనిట్‌ను నేను అభినందిస్తున్నాను. పలు ఛానెల్స్‌లో భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఈ కార్తీక మాసంలో చల్లటినీటితో తలస్నానం చేయమంటారు. కానీ ఎవరూ చల్లటి నీరుతో తలస్నానం చేయవద్దని నేను చెబుతున్నాను.

పండుగ రోజున సంజయ్ దత్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన మోహన్ లాల్, మున్నాభాయ్ ఇంట్లో దీపావళి వేడుకలకు హాజరు, సంజయ్‌, మాన్యతా నా స్నేహితులు అంటూ ట్వీట్

ఎందుకంటే కరోనా అనేది నిమోనియాకు సంబంధించింది. దానికి ఇంత వరకు వ్యాక్సిన్‌ రాలేదు. రాదు కూడా. కరోనా అనేది మనిషి మెదడును కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. ప్రకృతిని మనం అతిక్రమిస్తే, ప్రకృతి మనకెలా సమాధానం చెబుతుందనే దానికి ఉదాహరణే ఈ కరోనావైరస్. కాబట్టి ఎవరూ తలస్నానాలు చల్లటి నీటితో చేయవద్దు. వేడినీటితోనే స్నానాలు చేయండి. ఆరోగ్య సూచనలు పాటించండి. కరోనా వైరస్‌ నివారణకు ఇంకా సమయం పడుతుంది. కరోనా వైరస్‌ ఎంత మంది ప్రాణాలను బలిగొంటుందో చూస్తూనే ఉన్నాం. కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనం బలంగా ఉండాలి. మన జీవితంలో కరోనా ఓ భాగమైపోతుందేమోననిపిస్తుంది" అన్నారు.