మెగా ఫ్యామిలీలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్థారణ (Covid in Mega Family) అయింది. ఈ రోజు ఉదయమే తాను కరోనా బారినపడినట్లు రామ్‌చరణ్ (Ram Charan)వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్ట్ చేసుకోవాలని కోరారు.
అయితే చరణ్ అనంతరం నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్‌కు (Varun tej) తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. ఈ రోజు ఉదయం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్దిగా లక్షణాలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని’. అని ఓ నోట్ విడుదల చేశారు.
మెగా హీరోలిద్దరూ కరోనా సోకడంతో అభిమానులు #Get Well Soon అనే హ్యష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా నాలుగు రోజుల క్రితమే వరుణ్‌తేజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్ జరుపుకున్నారు. ఇప్పుడు వీరంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చరణ్, వరుణ్‌కు పాజిటివ్‌గా (varun tej Tests Positive for COVID-19) తేలడంతో మెగా కుటుంబంలో టెన్షన్ మొదలైంది
Here's Varun Tej , Ram Charan Tweets
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020
Request all that have been around me in the past couple of days to get tested.
More updates on my recovery soon. pic.twitter.com/lkZ86Z8lTF
— Ram Charan (@AlwaysRamCharan) December 29, 2020
అయితే రాంచరణ్ కు ఎలాంటి లక్షణాలు (Ram Charan Tests Positive for COVID-19) కనిపించలేదు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలిజయజేస్తాను’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
ఇక నాలుగు రోజుల క్రితం చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్ జరుపుకున్నారు. అంతేకాక రెండు రోజుల క్రితం చరణ్ ఆచార్య సెట్‌కి వెళ్లారు. డైరెక్టర్ కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్‌ను కలిశారు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరిని పలకరించారు. ఇక ప్రస్తుతం చరణ్‌కి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో వీరందరిలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే చిరంజీవి, నాగబాబు కోవిడ్ బారీన పడి కోలుకున్న సంగతి విదితమే.