Prabhas - Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లిపై స్పందించిన కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్ కాబోయే భార్యపై గుడ్ న్యూస్ వింటారంటూ కామెంట్...
ప్రభాస్, అనుష్క (Image: Twitter)

తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా హీరో గా ఎదిగిన వారిలో ప్రభాస్ కూడా ఒకరు. ఈ స్టార్ హీరో మొదటి సినిమా ఈశ్వర్ తోనే ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగి బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలు తీశాడు. చెప్పాలంటే ఇప్పట్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో ప్రభాస్ ఒక్కరు.

ప్రభాస్ అంటే అమ్మాయిల గుండెల్లో రాక్ స్టార్ అని చెప్పవచ్చు. అలాంటి స్టార్ హీరోకి పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ రాదేశ్యామ్ రిలీజ్ సమయంలో తాను అమ్మాయిల విషయంలో లెక్కలలో ఫెయిల్ అయ్యాయని అందుకనే తనకు పెళ్లి కాలేదేమోనని ప్రభాస్ తనపై తానే జోక్స్ కూడా వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..

ప్రభాస్ – అనుష్కల పెళ్లి చేసుకుంటారనే భావన అందరి మనసులో ఉంది. అయితే ఈ వార్తలను ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ప్రభాస్ పెళ్లి గురించి వాళ్ళ పెద్దమ్మ ఏమన్నారంటే… ప్రభాస్ మన సంస్కృతి, సాంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం.. మహిళల అంటే చాలా గౌరవం ఉంది. అంతేకాకుండా కుటుంబానికి పెద్దలకు చాలా గౌరవం ఇస్తారు. ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అని శ్యామలాదేవి తెలిపారు.

ప్రభాస్ ఓ నటితో ప్రేమలో ఉన్నారని ఆమెనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయని ప్రశ్నిస్తే… ఆ వార్తల్లో నిజం లేదని శ్యామలాదేవి ఈ వార్తలను ఖండించారు. ప్రభాస్ కి కాబోయే భార్య ఇండస్ట్రీలో అమ్మాయా… లేక వేరే అమ్మాయా? అడిగితే ఏదీ ఇప్పుడే చెప్పలేమని అయితే తప్పకుండా ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని తెలిపారు.

ఈశ్వర్, వర్షం ,చక్రం లాంటి ఎన్నో సినిమాలను తీశాడు. కానీ బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా ప్రభాస్ ను కొత్తగా చూపించింది. ‘రాధేశ్యామ్’ తెలుగు, హిందీ, కన్నడ ,మలయాళం , తమిళ్ భాషలలో మార్చి 11న ప్రపంచమంతా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో హీరోయిన్ పూజ హెగ్డే .. ఇక రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు.