
వర్షం (Rain) అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? భానుడి భగభగలతో అల్లాడిపోయే తెలుగు రాష్ట్రాల ప్రజలు, నైరుతి రురాగాలతో చల్లటి వానజల్లు మేను తాకగా పరవశించిపోరా, చిరుజల్లులతో మైమరిచిపోరా? ఈ పరవశానికి మన టాలీవుడ్ వాన పాటలు (Tollywood Rain Songs) తోడైతే అంతకంటే రొమాంటిక్ ఫీలింగ్ మరొకటి ఉంటుందా?
జోరు వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం ఎలా ఉంటుందో కానీ కారులో షికారు చేస్తూ ఒక వాన పాట, బాల్కనీలో కూర్చుండి చిటపట చినుకుల్ని చూస్తూ కాఫీ తాగుతూ ఒక పాట, వర్షంలో రోడ్డు పక్కన వేడి వేడి పకోడిలు తింటూ పిల్లగాలిలా మెల్లగా మన చెవుల్ని పలకరించే ఓ పాట. ఇలా ఈ వానాకాలంలో (Rainy Season) ప్రతీ సందర్భంలో మీ మదిలోని భావాలకు అనుగుణంగా వాన పాటలు వింటూ ఉంటే ఆ మజానే వేరు. మరి ఇంకేం.. మీ ప్లేలిస్ట్ ని వాన పాటలతో నింపేయండి, సంగీత వర్షంలో తడిసి మురిసిపోండి.
మన టాలీవుడ్ లో వచ్చిన వచ్చిన కొన్ని సూపర్ హిట్ వాన పాటలు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) టాప్ లో ఉంటారు.
వర్షం - ఇన్నాళ్లకు గుర్తొచ్చానా.. వానా?
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం..
రచ్చ - వానవాన వెల్లువాయే Remix
కలుసుకోవాలని - ఉదయించిన సూర్యుడినడిగా
అతనొక్కడే -చిటపట చిటపట చిందేవాన
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
వాన చినుకులు ఇట్ట తగిలితే
రంగు రంగు వాన..
ఆవారా - అరెరె వానా జడివాన
ఆకుచాటు పిందె తడిచే
స్వాతిముత్యపు జల్లులలో
వానావానా వెల్లువాయే
ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది
జల్లు జల్లుమని సిరిమువ్వలే చినుకే తాకగా
వాన జల్లు గిల్లుతుంటే ఎట్లాగమ్మా
కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
వానా వానా వెన్నెల వాన