Nagarjuna (Credits: X)

Hyderabad, June 24: టాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.  ఎయిర్‌ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని (Fan) ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు. సదరు అభిమానిని నిర్దయగా పక్కకు ఈడ్చి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌ గా మారడంతో నాగార్జున స్పందించారు.  విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరిగి ఉండకూదని విచారం వ్యక్తం చేశారు. ‘ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతున్నా’ అని నాగార్జున పేర్కొన్నారు.

తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు.. కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం

నాగ్ కు తెలియకుండానే..

నిజానికి తనను కలిసేందుకు అభిమాని వస్తున్న విషయం నాగ్ గమనించలేదని.. ఒకవేళ.. ఆయన గమనిస్తే, అప్పుడే నాగ్ స్పందించేవారని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు