Vijay Antony’ on Sets (Photo Credits: Twitter)

సంగీత దర్శకుడు, బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి.మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్‌లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం.ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది.

బాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ లిరికల్ రైటర్ నాసిర్ ఫరాజ్ కన్నుమూత, గుండెసంబంధిత వ్యాధితో తిరిగిరానిలోకాలకు..

ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.