Hyd, Dec 13: ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంఘటన విధితమే. ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్యా థియేటర్ యజమాని మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు వేయగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ , రష్మిక , మరికొంతమంది మూవీ టీమ్ వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీగా వచ్చారు. అల్లు అర్జున్ పై కేసు నమోదు, మహిళ మృతిపై నిర్లక్ష్యం విషయంలో పోలీసుల సీరియస్ యాక్షన్
ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది. మరో బాలుడు స్పృహతప్పి పడిపోవడంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, అతని టీమ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. ఇక బన్నీ రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు బన్నీ.
Here's Video:
సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ ..#alluarjun #pushpa2 #alluarjunarrest #tv9telugu #breakingnews pic.twitter.com/xbph6jYHGS
— TV9 Telugu (@TV9Telugu) December 13, 2024