Shakila: నా కన్నతల్లే డబ్బులు తీసుకుని నన్ను మగాడి గదిలోకి పంపేది, కన్నీటి పర్యంతమైన షకీలా, ఇంకా ఆమె ఏం చెప్పిందంటే..
Shakila (Photo-Facebook)

శృంగారాన్ని ఆస్వాదించే సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఒకప్పుడు షకీలా అంటే మలయాళ సినిమా పరిశ్రమలో పెద్ద సంచలనం. అంతే కాకుండా సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే.. అలాగే షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వాయిదా పడాల్సిందే.. అలా ఆమె సినిమాల ముందు.. భారీ చిత్రాలే హిట్ సునామిలో కొట్టుకుపోయాయి. తమిళనాడుకు చెందిన షకీల సౌత్ చిత్ర పరిశ్రమను తన అందంతో ఓక ఊపు ఊపేసింది.

ఒకప్పుడు షకీలా నటించిన సినిమాలు అన్ని శృంగారానికి సంబంధించినవి ఉండేవి. అలాగే ఆమె చాలా ఏళ్ల నుంచి అలాంటి చిత్రాలకు దూరంగా ఉంటూ.. ప్రస్తుతం షకీలా ఇప్పుడు తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలు చేస్తుంది. ఇంకా కొన్ని టెలివిజన్ లొ వచ్చే కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలు చేస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది. అంతేకాకుండా షకీలకు వచ్చే సంపాదనలో కొంతవరకు సామాజిక సేవా రంగంలో ఖర్చు చేస్తుంది.

అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి

షకీలా కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే సీని రంగ ప్రవేశం చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని చాలా సార్లు కొన్ని సందర్బాలలో బయటకు చెప్పేసింది.తన సినిమా కెరీర్ తో పాటు జీవితంలో తనకు ఎదురైన చేదు అను భవాలను షకీలా షేర్ చేసుకుంది. అయితే ఆ అనుభవాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రపంచం ఆమె ప్రతిభను సరిగ్గా వినియోగించుకోలేదని.. కేవలం తన బాడీ బ్యూటీని చూసి.. డబ్బు సంపాదించుకునేందుకు ఉపయోగించుకున్నారని..షకీలా మరోసారి గుర్తు చేసింది. డబ్బు కోసం నా శరీరాన్ని మొదటగా వాడుకున్నది నా సొంత తల్లే అని వెల్లడించింది. గతంలో కూడా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇదే విషయాన్ని తెలియజేసింది.

నేను చిన్న వయసులోనే బలంగా కనిపించేదానిని.. నా వయసు కన్నా మించి నా హైట్ ఉండేది. అలాగే నేను హైస్కూల్ లో చదువుతున్నప్పుడే కాలేజీ అమ్మాయిలా ఉండేదాన్ని.. దారిలో నన్ను చాలా మంది ఓ రకంగా చూసేవారు. అలా ఎందుకు చూస్తున్నారని అర్థం కాలేదు. మా ఇంట్లో ఎప్పుడు డబ్బే పెద్ద సమస్యగా ఉండేది. దీంతో మా అమ్మ మగవాళ్లను పరిచయం చేసి వాళ్ల గదికి వెళ్లమని చెప్పేది. అందుకు నేను ఒప్పుకునేదానిని కాదు..అందువలన అమ్మ ఆ విషయంలో బాగా కొట్టేది. దీంతో నాకు వేరే మార్గం లేక.. నోరు మూసుకుని అమ్మ చెప్పినట్లు ఉండేదానిని అని షకీలా అన్నారు.

ఫ్రిడ్జ్‌లో దొరికిన మోడల్ శవం, రెండు నెలల ప్రెగ్నెంట్‌గా తేల్చిన పోలీసులు, కాళ్లు, చేతుల కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి దారుణంగా హత్య, పోస్టుమార్డంలో సంచలన నిజాలు

అలా షకీలా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకి రాకముందు నుంచి కూడా డబ్బు కోసం నా కుటుంబం నన్ను పురుషుల గదికి పంపేదని చెప్పింది. దీంతో ఏం చేయలేని పరిస్థితి వలన అందుకు సిద్దపడ్డానని.. మాఅమ్మమ్మ, అమ్మ కూడా ఈ విధంగానే డబ్బులు సంపాదించారు. నన్ను కూడా అదే దారిలో వెళ్లమన్నారు. కానీ ఆ దారిలో వెళ్లకుండా చిత్ర పరిశ్రమ ఎంచుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం నా శరీరాన్ని కేవలం ప్రదర్శనకు వాడేవారని.. అందువలన నేను చాలా భాదపడ్డాను.. నాకు ఆర్టిస్టుగా ఉండే అర్హత ఉన్నా నన్ను ఎవరు ఇండస్ట్రీలో తీసుకోలేదు.

నన్ను కెమెరా ముందు కీలుబొమ్మలా వాడుకున్నారని చెప్పింది.ఇంకా నా జీవితంలో నా సోదరే నన్ను అంతలా మోసం చేసింది. నేను దాచిపెట్టిన డబ్బు మెుత్తం నా సోదరి తీసుకొని మోసం చేసినట్లు.. ఇటీవలే జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కనిపించి చెప్పింది. కానీ షకీలా రెండో వారంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అంతే కాకుంగా ఆ షోలో ఇంకొన్ని రోజులు ఉంటే మరికొంత డబ్బు వచ్చి ఉండేదని.. ఆ డబ్బును పలు సామాజిక సేవలకు ఉపయోగించేదని.. ఆమె అభిమానులు చెప్పారు.