
టాలీవుడ్ నటుడు, కమెడియన్ అదిరే అభి(అభినవ్ కృష్ణ) ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారు. అభి (Jabardasth comedian Adhire Abhi) ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కిస్తుండగా.. ఫైటర్‌ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌లోని ఒకరు తెలిపారు. 9 ఏళ్ళకే అమ్మ చనిపోయింది, పటాస్ ఫేమ్ ప్రవీణ్ ఎమోషనల్ వ్యాఖ్యలు, ఇంద్రజ రూపంలో తల్లిలేని లోటు తీరిందని వెల్లడి
ప్రస్తుతం అభి క్షేమంగా (Adhire Abhi Helth Update) ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల వరకు అభి విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’తో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు అభి. ఆ తర్వాత కొన్నాళ్లు పలు రియాల్టీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే కామెడీ షోలో టీమ్ లీడర్‌గా చేసి, ఇటీవల బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో పాటు ఓ కామెడీ షో చేస్తున్నాడు.