
భారీ పోలీసు బందోబస్తు మద్య రేపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections 2021) జరగనున్నాయి. మా ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో రేపు ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మా ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడు గదుల్ని ఏర్పాటు చేశారు.
మూడు గదుల్లో కలిపి 12 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒకేసారి ఒక గదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలీసుల బందోబస్తు కోసం మూడు ప్లటూన్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో మహిళా విభాగం కూడా ఉంది. మా ఎన్నికల్లో మొత్తంత 883 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అటు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్(Prakash Raj Pannel), ఇటు మంచు విష్ణు ప్యానెల్(Manchu Vishnu Pannel) ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులతో ఓటింగ్ జరగనున్న ప్రాంతంలో సమావేశమయ్యారు.
సినిమా బిడ్డలం’ ప్రకాశ్‌రాజ్ (Prakash Raj), ‘మాకోసం మనమందరం’ అంటూ మంచు విష్ణు (Vishnu Manchu) ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. కొద్దిరోజులుగా రెండు పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. మొదట్లో ‘‘ప్రకాష్‌రాజ్ నాన్‌లోకల్. షూటింగ్‌లకే సరిగా రాడు. ఇక ‘మా’ సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ‘‘మూడు దశాబ్దాలుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ నన్ను నాన్ లోకల్ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ అవుతాను’’ అని ప్రకాశ్‌రాజ్ తన వాదన వినిపించుకున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు మూడు రోజుల కింద ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే. ఆయన ఉంటే ‘మా’ అసోసియేషన్ బాగుపడుతుంది. మన తెలుగువాళ్లు వేరే భాషల్లో నటించడం లేదా?’’ అని పేర్కొన్నారు.
ఈ ఊళ్లోనే ఉంటా’ అని మంచు విష్ణు ప్రకటించారు. ఆయన తండ్రి మోహన్‌బాబు కూడా.. ‘‘ఈ ఊళ్లోనే ఉండే నా కుమారుడు ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాట ఇస్తున్నాను. మీ ఓటును మంచు విష్ణుకు, అతడి పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుకుంటున్నానని శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ని 1993లో ఏర్పాటు చేశారు. చిరంజీవి వ్యవస్థాపక అ«ధ్యక్షుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి వారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 900 మందికిపైగా ఉన్నారు.
సీవీఎల్ నరసింహరావు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయ్యాను. బురదలో ఉన్న వికసించడానికి నేను కమలాన్ని కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నం చేశానని, ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మొదట ‘మా’ అధ్యక్ష పోటీకి బరిలో దిగిన ఆయన నేమినేషన్ కూడా దాఖలు చేశాడు. అనంతరం పోటీ నుంచి తప్పకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.