మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎలక్షన్స్‌ని (MAA Elections 2021) తలపిస్తున్నాయి. అధ్యక్షులు, ప్యానెల్ సభ్యులు ప్రత్యర్ధులపై మాటల దాడులు చేస్తున్నారు. అక్టోబర్ 10న జరగనున్న పోటీలో ఎవరు గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. నేటితో మా ఎన్నికల నామినేషన్ పర్వం (Nominations closed today) ముగుస్తుంది.
అయితే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తుండగా, వీరిరివురు ఇప్పటికే నామినేషన్స్ వేశారు. అక్టోబర్ 10 (elections to be held on October 10) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. ఆరోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు పోటీ పడుతుండగా, ఈ ముగ్గురితో పాటు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా నామినేషన్ వేశారు.
రేపు నామినేషన్‌లను పరిశీలిస్తారు. అక్టోబర్ 1, 2 తేదీలు నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి గడువుగా తెలియజేశారు. పోటాపోటీగా ప్రచారాలు చేస్తుండగా, ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. ఆరోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి.