Chennai, August 30: వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా (Hero Vishal) సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ (Powerful) పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం "మార్క్ ఆంటోనీ". దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా (Pan India) చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పైరసీకి చెక్.. ఏకంగా 1788 పైరసీ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు.. కోబ్రాకు లైన్ క్లియర్
"మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నట్లు చాలా పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపిస్తున్నారు. సరికొత్త గెటప్ లో ఉన్న విశాల్ ను కాసేపు వరకూ ఫ్యాన్స్ (Fans) కూడా గుర్తించకపోవడం విశేషం.