NTR Birth Anniversary chiranjeevi-shares-special-photo-with-ntr (Photo-chiranjeevi Twitter)

Hyderabad, May 28: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు 97వ జయంతి (NTR 97th Birth Anniversary) సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటుగా ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ (Nandamuri Taraka Rama Rao) అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, టీడీపీ మహానాడులో విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు, టీడీపీ కార్యాలయానికి కోవిడ్ 19 నోటీసులు పంపించిన ఏపీ సర్కారు

ఎన్టీఆర్‌ మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌లు కూడా ట్విటర్‌ వేదికగా ఆయనను గుర్తుచేసుకుని.. నివాళులర్పించారు. ప్రతి ఏటా న్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులు అర్పించే వీరు ఈ సారి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘మీరు లేని లోటు తీరనిది. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Here's Jr NTR, Kalyanram Tweets

‘మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత’ అని కల్యాణ్‌రామ్‌ పోస్ట్‌ చేశారు. చంద్రబాబుపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై నేడు విచారణ , ఆ 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేయాలన్న ఏపీ హైకోర్టు

ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ట్వీట్టర్ ద్వారా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం,తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో (N.T. Rama Rao) కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరు ఎన్టీఆర్‌కు, ఎన్టీఆర్‌ చిరుకు స్వీట్స్ తినిపించే ఫోటోను షేర్ చేశారు.

Here's Chiranjeevi Konidela Tweet

చిరంజీవి, ఎన్టీఆర్‌ 1981లో ‘తిరుగులేని మనిషి’అనే సినిమాలో కలిసి నటించారు. ఇందులో రతి అగ్నిహోత్రి, ఫటాఫట్ జయలక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవీ వర ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కేవీ మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లాయర్‌ పాత్రలో, చిరంజీవి సింగర్ పాత్రలో నటించి మెప్పించారు. 1981 ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలైంది.

Here's Vice President of India Tweet

సినిమాల్లో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా ఎన్టీఆర్ నిలిచిపోయారు. సుమారు 400 చిత్రాల్లో నటించి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా కళామ్మతల్లికి ముద్దుబిడ్డ అయ్యారు.

Here's Lokesh Nara Tweet

పురాణ పురుషుల పాత్ర ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించబడ్డ ఎన్టీఆర్ రాజకీయ నేతగానూ ప్రజలచే కీర్తింపబడ్డారు. ‘ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది. కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి’ అంటూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించారు.

Here's NTR video

పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఓటమెరుగని ఢిల్లీ నాయకులకు తెలుగోడి సత్తాను రుచిచూపించారు.పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం అంటూ తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఎన్టీరామారావు పేద విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. ఎంసెట్ లాంటి అడ్మిషన్ పరీక్షలను ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి విద్యా రంగాన్ని బాగా తీర్చిదిద్దారు. తిరుపతి ని బాగా డెవలప్ చేయడమే కాకుండా, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో కట్టించారు. తిరుపతి విశాఖపట్నం వరంగల్ విజయవాడ నగరాల్లో ఏర్పాటు నిర్మాణాలకు నాంది పలికారు. హైదరాబాద్ నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ని కట్టించారు. బుద్ధుడి విగ్రహం నిర్మాణానికి కూడా ఎంతో దోహదపడ్డారు.కేవలం ఎన్టీరామారావు పరిపాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోడ్ల నిర్మాణాలు జరిగాయి. చెన్నైలోని ఫిలిం ఇండస్ట్రీ లాగా హైదరాబాద్ లో కూడా షూటింగ్లు చేసుకోవడానికి ఎన్టీరామారావు అనేక ఏర్పాట్లు చేశారు.