జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'వకీల్ సాబ్' ట్రైలర్ (Vakeel Saab Trailer Released) నిన్న విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవన్‌కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ (Pawan Kalyan vakeel-saab-Movie trailer) యూ ట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేయడమే కాకుండా.. వ్యూస్, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. 'వకీల్‌సాబ్' ట్రైలర్‌కు ఇప్పటికే 12 మిలియన్స్ వ్యూస్ రాగా.. దాదాపు 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 'వకీల్‌సాబ్' ట్రైలర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే మిలియన్ లైక్స్ దాటేసింది. రెండేళ్ల తరువాత విడుదలైన పవన్ మూవీ ట్రైలర్ కావడంతో అంచనాలను మించిన స్పందన లభిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే వకీల్ సాబ్ ట్రైలర్ సోమవారం రిలీజ్ చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక థియేటర్‌లో సోమవారం పవన్ కళ్యాణ్ సినిమా మూవీ ట్రైలర్ (Vakeel Saab) రిలీజ్ సందర్భంగా తోపులాట చోటు చేనుకుంది ఈ తోపులాటలో (Ruckus Erupts at Theatre in Visakhapatnam) సినిమా హాల్ అద్దాలు పగిలాయి. పగిలిన అద్దాలపై అభిమానులు పడటంతో కొందరికి గాయాలయ్యాయి. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్' ట్రైలర్ లాంచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు సంగం శరత్ థియేటర్‌లో రావడంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది.
‘మీరు వర్జినా.. అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా’ అంటూ కోర్టులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాదిస్తూ కనిపించాడు. ఏం న్యాయం నందాజీ.. కూర్చోండి అంటూ ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్ ఇస్తూ కనిపించాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ శనివారం హోలీ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ విడుదలతో పవన్ కల్యాణ్ అభిమానులకు హోలీ గిఫ్ట్ చిత్ర బృందం అందించింది. న్యాయవాది పాత్రలో పవన్ అదరగొట్టారు.
అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులుగా కనిపిస్తున్నారు. ‘మీరు వర్జినా..?. అందరికీ వినబడేట్టు గట్టిగా చెప్పండి’ అంటూ ప్రకాశ్ రాజ్ నివేథాను ప్రశ్నిస్తుండడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నప్పటికీ ట్రైలర్‌లో మాత్రం కనిపించలేదు. న్యాయవాది పాత్రలో పవన్ ఆకట్టుకున్నారు. పవన్‌కు ప్రత్యర్థి న్యాయవాదిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తున్నారు. అత్యాచార ఘటనపై కోర్టులో జరిగే వాదోపవాదనలు సినిమాలో కీలకంగా ఉండనుంది. హిందీ సినిమా ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది.