Mangalavaaram Teaser Out: నగ్నంగా అందాలు ఆరోబోస్తున్న హాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, మంగళవారం టీజర్ వచ్చేసింది, టీజర్ ఇదిగో..
Payal Rajput Mangalavaaram (Photo-instagram)

హాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తాజా నటిస్తున్న సినిమా ‘మంగళవారం. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా ఇది. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు.

ఒక నిమిషం 18 సెకండ్ల నిడివి గల మంగళవారం సినిమా టీజర్‌.. ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. గ్రామస్తులందరూ ఏదో చూసి భయపడుతున్న సీన్స్ చూపించారు. ఇక టీజర్‌ ‘ఏం చూశారండి’ అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. టీజర్‌ చివర్లో పాయల్‌ రాజ్‌పుత్‌ బోల్డ్ లుక్‌లో అరుస్తూ కనిపించారు. ఇక ‘ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా’ అనే డైలాగ్ అందరికి నవ్వు తెప్పిస్తుంది. మొత్తానికి టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది.

బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టేదెప్పుడు ప్రభాస్, సలార్ మూవీపై గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు, సెప్టెంబర్ 28న రానున్న ప్రభాస్ సలార్

ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న మంగళవారం సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది.ఆర్‌ఎక్స్ 100 సినిమాలో చేసిన విధంగా మరోసారి పాయల్‌ రాజ్‌పుత్‌ బోల్డ్ రోల్‌ చేశారు.

Here's Teaser Video

ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి అద్భుతమైన సినిమా తీస్తున్నట్లు నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి తెలిపారు. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టిందని.. 48 రోజులు పగటి పూట, 51 రోజులు రాత్రి వేళల్లో షూటింగ్ చేశామని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో ఈ సినిమా తీస్తున్న దర్శకుడు అజయ్ భూపతి పేర్కొన్నారు. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయని, ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుందన్నారు. కాంతార సినిమా ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రంకు సంగీతం అందిస్తున్నారు.