Salaar Movie

బాహుబలితో ప్రపంచ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయాలు సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా ఒక్కటి కూడా హిట్ ఖాతాలో చేరలేదు. అన్నీ యావరేజ్ గా నిలిచాయి. సాహో స్టైలీష్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ప్రభాస్ క్రేజ్ కి తగిన స్థాయిలో ఇది లాగలేకపోయింది.

ఐమాక్స్ ముందు సినిమా రివ్యూస్ బ్యాన్, దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఐమాక్స్ యాజమాన్యం

ఇక ఆ తరువాత 'రాధేశ్యామ్' సినిమా చేశాడు. ప్రభాస్ కి లవ్ స్టోరీ వర్కౌట్ అవుతుందా .. పైగా క్లాసికల్ టచ్ లా కనిపించే ఎమోషన్స్ ఆయనకి నప్పుతాయా? హస్తసాముద్రకుడిగా ఆయన పాత్రలో ఆశించిన ఎనర్జీ ఉంటుందా? అని అభిమానులు డౌట్ పడ్డారు. అన్నట్టుగానే ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఇక ఇటీవల వచ్చిన 'ఆదిపురుష్' .. వీకెండ్ తరువాత ఒక్కసారిగా వసూళ్ల గ్రాఫ్ పడిపోవడం చూసింది. ఓం రౌత్ లా కష్టపడి పనిచేసే డైరెక్టర్ ను తాను చూడలేదని ఈవెంటులో ప్రభాస్ చెప్పిన మాటలు విమర్శలను తెచ్చిపెట్టాయి.

ఆదిపురుష్‌ సినిమాకు రూ.600 కోట్లు దండగ, రామాయణం గురించి చిన్నా పిల్లాడికి తెలిసినంతగా మేకర్స్‌కు తెలియదా, శక్తిమాన్‌ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు

ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి రానున్న మరో సినిమా 'సలార్'. ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ వచ్చి చాలా కాలమైంది. అందువలన 'సలార్' పెద్ద హిట్ కొట్టవలసిన అవసరం ఉంది. ఇది ఆ తరువాత వచ్చే 'ప్రాజెక్టు K' బిజినెస్ పై ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడం .. ప్రభాస్ మాస్ ఇమేజ్ కి తగిన కంటెంట్ కావడం వలన, 'సలార్' సంచలనాన్ని నమోదు చేయడం ఖాయమే అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది.