ఆదిపురుష్‌పై శక్తిమాన్‌ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఈ చిత్రానికి రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆదిపురుష్‌పై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో షేర్‌ చేశారు. వీడియోలో ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ..'రామాయణానికి ఆదిపురుష్‌ను మించిన అగౌరవం ఇంకొకటి లేదు. దర్శకుడు ఓం రౌత్‌కు రామాయణంపై కొంచెం కూడా పరిజ్ఞానం లేదు. మనోజ్‌ రాసిన డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే చూసి నిద్రమాత్రలు కూడా సిగ్గుపడతాయి.

ఆదిపురుష్‌ మూవీ ఓ పెద్ద జోక్‌. రామాయణం గురించి ఆదిపురుష్‌ మేకర్స్‌ కంటే కూడా సాధారణ పిల్లాడికే బాగా తెలుసు. అసలు ఈ సినిమాకు రూ.600 కోట్లు ఎలా ఖర్చు చేశారో అర్థం కావడం లేదు' అంటూ విమర్శలు చేశారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)