Prabhas Salaar Release Date: ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఏప్రిల్ 14, 2022న సినిమా విడుదల అవుతున్నట్టు తెలిపిన యూనిట్, 2021 జూలై 30న రాధే శ్యామ్ విడుదల
Prabhas and Shruti Haasan's Salaar to release on April 14

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా, పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ సలార్ సినిమా విడుదల తేదీని (Salaar Release Date) దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14, 2022న సినిమా విడుదల అవుతున్నట్టు పోస్టర్ కూడా విడుదల చేశారు. దాంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సాహో సినిమా తర్వాత తెలియకుండానే మరోసారి రెండేళ్ళ విరామం వచ్చేసింది. దానికి ముందు బాహుబలికి ఐదేళ్లకు పైగానే తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు అసలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు ప్రభాస్. 2021 జూలై 30న రాధే శ్యామ్ (Radhe Shyam) విడుదల కానుంది. అది వచ్చిన 8 నెలల్లో సలార్ సినిమా విడుదల చేస్తున్నాడు ప్రభాస్.

ఏప్రిల్ 14వ తేదీనే నిర్మాతలు స‌లార్ రిలీజ్ చేయడానికి వెనుక పెద్ద ప్లానింగ్ ఉంది. అదిరిపోయే మెగా ప్లానింగ్ తో ప్రభాస్ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు దర్శక నిర్మాతలు. అసలు విషయం తెలిస్తే అయ్య బాబోయ్ అనుకోక తప్పదు. కేవలం ఒక భాషలో అయితే ఏ రోజు విడుదల చేసిన పర్వాలేదు కానీ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అన్ని ఇండస్ట్రీలలో ఓపెనింగ్ కీలకం. దానికి తోడు కేజిఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Here' s Salaar Release Date statement

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి..15 గుడ్ ఫ్రైడే..16 శనివారం.. 17 ఆదివారం అంటే 5 రోజుల వీకెండ్ అన్నమాట. అన్ని సెలవులు ఉన్నాయి కాబట్టే ఆ పర్ఫెక్ట్ తేదీని సెలెక్ట్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ లాంటి మాస్ హీరోకు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 5 రోజులు సరిపోవా 200 కోట్లు కొల్లగొట్టడానికి. సరిగ్గా ఇదే ప్లానింగ్తో తన సినిమాను విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

రాధే శ్యామ్ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్, సినిమా ఫస్ట్ లుక్ విడుదల

ఎలాగూ దాదాపు ఏడాది ముందే విడుదల తేదీ అనౌన్స్ చేశారు కాబట్టి మరో సినిమా అటువైపు వెళ్లదు. ఏదేమైనా ప్రభాస్ ప్లానింగ్ చూసి అదరహో అంటున్నారు అభిమానులు. సలార్ కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఉగ్రం సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. సంగీత దర్శకుడు రవి బసృర్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు.