Aadi purush: ఆదిపురుష్ షూటింగ్ నుంచి ప్రభాస్‌కు రిలీవ్, తన పార్ట్ షూటింగ్ పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్‌లో టీమ్ బిజీ
వరుస సినిమాల్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఒక్కొక్కటిగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్‌లో తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు ప్రభాస్.
Mumbai November 04: వరుస సినిమాల్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఒక్కొక్కటిగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్‌లో తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు ప్రభాస్.
Last day, last shot and tons of amazing memories but the journey is not over yet!
See you soon darling #Prabhas#Adipurush #AboutLastNight pic.twitter.com/rtB7KahopK
— Om Raut (@omraut) November 4, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రధాన పాత్రలలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 300-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు.
ఇప్పటికే చిత్ర కథానాయిక కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ చిత్రీకరణను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ పార్ట్ కూడా పూర్తైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంబురాలు చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్‌ఎక్స్ పనుల్లో యూనిట్ బిజీగా ఉంటుంది. ఈ చిత్రం టీజర్, ఇతర ప్రచార కంటెంట్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11, 2022న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది.
(The above story first appeared on LatestLY on Nov 04, 2021 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

