భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంపై రామానుజాచార్యులు ఎంతో ప్రభావం చూపారు. విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్తగా ఈయనను చెప్పుకోవచ్చు.హేతువాది, యేగి, రామమాజించార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు కర్తవ్యదీక్షలో ప్రదర్షించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనస్యసామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యుని జీవితం ఒక ఉదాహరణ.. ఇప్పుడు తాజాగా ఈయన ప్రస్తావన ఎందుకంటారా..ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ రామానుజాచార్యుని జీవిత కథను (Ramanujacharya Movie) తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
బాలకృష్ణతో (Ramanujacharya With Balakrishna) ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నట్టుగా నిర్మాత సి.కల్యాణ్ (Producer C Kalyan) ఓ ఇంటర్యూలో చెప్పారు. ఈ పాత్రను చేస్తే బాలయ్యే చేయాలనీ .. మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తికాగానే ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు.ఇక సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాలు చేయడంలో బాలకృష్ణకి ఎదురులేదు.
ఆయితే ఆ కథలకు పూర్తి భిన్నంగా 'రామానుజాచార్య' జీవితం ఉంటుంది. అయితే ఒక సినిమాకి కావలసిన ఆసక్తికరమైన మలుపులు ఎన్నో ఆయన జీవితంలో కనిపిస్తాయి.
ఒ ఇంటర్యూలో నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ.. నా డ్రీమ్ ప్రాజెక్టు రామానుజాచార్యలో బాలయ్యబాబునే ఊహించుకుంటున్నానని, ఈ ప్రాజెక్ట్ ఆయనతోనే చేస్తానని అన్నారు. అలాగే ఏపీ సినిమా టికెట్ రేట్లపై కూడా ఇంటర్యూలో ఆయన స్పందించారు. ఏపీ ప్రభుత్వంతో సయోధ్య అవసరమని గొడవలతో పనులు కావని తెలిపారు. సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీని వదులుకోవడానికి ఇష్టపడరని మేము ఆయనతో మాట్లాడామని తెలిపారు. వైజాగ్ లో కూడా సినిమా ఇండస్ట్రీ రావాలని ఆయన కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని దానికనుగుణంగా మేము ముందుకు సాగుతామని తెలిపారు.